https://oktelugu.com/

Prabhas: “ఆదిపురుష్” మూవీ టీమ్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చిన ప్రభాస్…

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు తీసుకు వెళ్లిన చిత్రం “బాహుబలి”. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. టి – సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రోఫిల్స్ కలిసి ఈ సినిమాను  దాదాపు రూ. 500 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 08:14 PM IST
    Follow us on

    Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు తీసుకు వెళ్లిన చిత్రం “బాహుబలి”. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. టి – సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రోఫిల్స్ కలిసి ఈ సినిమాను  దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

    pan india star prabhas gives surprise gifts to adipurush movie team

    Also Read: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు

    ప్రభాస్ వ్యక్తిత్వం అలానే అభిమానుల పట్ల ఎంత ప్రేమ చూపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు తాజాగా “ఆదిపురుష్” మూవీ టీమ్ కు ఖరీదైన బహుమతుల్ని ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు ప్రభాస్. గతంలో తన జిమ్ ట్రైనర్ కు రూ. 73 లక్షలు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కార్ ను బహుమతిగా ఇవ్వగా… అలానే ఓ అభిమానికి ఒక వాచ్ ఇచ్చిన విషయం కుడా తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా  “ఆదిపురుష్” లో తన పార్ట్ షూట్ ను పూర్తి చేసిన ప్రభాస్ …  ఆ సందర్బంగా చిత్ర బృందానికి ఖరీదైన “రాడో రిస్ట్ వాచెస్” ప్రెజెంట్ చేశారు. ఈ బహుమతి విషయాన్ని టెక్నికల్ టీమ్ లోని ఒక సభ్యుడు తెలియజేస్తూ దానికి సంబంధించిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో డార్లింగ్ ని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

    Also Read: హిట్ అయితే ఓకే.. లేదంటే అన్నీ సర్దుకోవాల్సిందే !