Gowtham Thinnanuri: రామ్ చరణ్‌ తో మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి…

Gowtham Thinnanuri: దర్శకధీరుడు రాజమౌళి నిర్మించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్. నందమూరి, మెగా ఫ్యామిలీ కుర్రోళ్ళు ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చరణ్ ఎన్టీఆర్ ప్రమోషన్ లో భాగంగా బిజీ అయిపోయారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తమిళ్ డైరెక్ట్ శంకర్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 16, 2021 2:32 pm
Follow us on

Gowtham Thinnanuri: దర్శకధీరుడు రాజమౌళి నిర్మించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్. నందమూరి, మెగా ఫ్యామిలీ కుర్రోళ్ళు ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చరణ్ ఎన్టీఆర్ ప్రమోషన్ లో భాగంగా బిజీ అయిపోయారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తమిళ్ డైరెక్ట్ శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీతో కలిసి ఓ  చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమాకి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ తదుపరి చిత్రం పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు.

director gowtham thinnanuri gives clarity about movie with ram charan

Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…

యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్ మెంట్ కూడా ప్రకటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయబోయో సినిమా పాన్ ఇండియా  రేంజ్ కాదనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో డైరెక్టర్ గౌతమ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో తాను చేస్తున్నది పాన్ ఇండియన్ సినిమానే అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ అన్నిటికీ గౌతమ్ చెక్ పెట్టినట్లు తెలుస్తుంది.  ఈ సినిమా ప్రేక్షకులు ఊహించుకున్న దానికంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుందని గౌతమ్ చెప్పుకొచ్చారు.

Also Read: ఏపీ టికెట్​ ధరల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం