Chandrababu And Pawan: చంద్రబాబు, పవన్ జోడి సక్సెస్ వెనుక కారణం ఇదీ

రెండు బలమైన సామాజిక వర్గాలను కలపడంలో చంద్రబాబు, పవన్ సక్సెస్ అయ్యారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న సూత్రం ఒకటి ఉంది. సుదీర్ఘకాలం కాపు, కమ్మల మధ్య వైరం కొనసాగుతోంది.

Written By: Dharma, Updated On : June 17, 2024 12:15 pm

Chandrababu And Pawan

Follow us on

Chandrababu And Pawan: ఏపీలో ప్రభుత్వం కొలువుదీరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్నారు. పవన్ కు ఇష్టమైన శాఖలను సైతం చంద్రబాబు కేటాయించారు. తనతో సమానంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. మిగతా మంత్రుల కంటే భిన్నంగా కాన్వాయ్ ని సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనతో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటం ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యవహార శైలి.. పవన్ నడుచుకుంటున్న తీరు చూస్తుంటే మాత్రం సుదీర్ఘ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు బలమైన సామాజిక వర్గాలను కలపడంలో చంద్రబాబు, పవన్ సక్సెస్ అయ్యారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న సూత్రం ఒకటి ఉంది. సుదీర్ఘకాలం కాపు, కమ్మల మధ్య వైరం కొనసాగుతోంది. కాపులు రెడ్డి సామాజిక వర్గంతో సర్దుబాటు అయినా.. కమ్మ సామాజిక వర్గంతో మాత్రం ఆశించిన స్థాయిలో సర్దుబాటు కాలేరు. అందుకే ఆ రెండు సామాజిక వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు ఆ ఇద్దరు నేతలు. అక్కడే సక్సెస్ అయ్యారు కూడా. వీరిద్దరితో పోల్చుకుంటే జగన్ పాచికలు పారలేదు. ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీలను ఏకతాటి పైకి తీసుకొచ్చి మద్దతు తెలుపుతానని జగన్ భావించారు. కానీ వారిలో చీలిక వచ్చింది. జగన్ సొంత సామాజిక వర్గం రెడ్లు కూడా దూరమయ్యారు. దాని పర్యవసానమే వైసిపి ఘోర పరాజయం.

2019 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. ఆపై రెడ్డి సామాజిక వర్గం సంపూర్ణ సహకారం తెలిపింది. అటు కాపులు సైతం మొగ్గు చూపారు. అందుకే 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అందుకే ప్రత్యేక వ్యూహంతో ఎన్నికల్లో ముందుకు సాగారు చంద్రబాబు, పవన్. ముందుగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చారు. తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో చీలిక తెచ్చారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలన్నీ వర్కౌట్ కావడంతో జగన్ అధికారానికి దూరమయ్యారు. టిడిపి కూటమి మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసింది వైసిపి. ఇప్పుడు వైసీపీ స్థానాన్ని భర్తీ చేయడానికి జనసేన వ్యూహాలు రూపొందిస్తోంది. 2029 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చి వైసీపీని నిర్వీర్యం చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. పవన్ వ్యూహం కూడా అదే. అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో పవన్ ను కూర్చోబెట్టారు. చంద్రబాబు తరువాత పవనే అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. అందుకే లోకేష్ సైతం పక్కకు తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేసి చంద్రబాబు తర్వాత ఆయనే అన్నట్టు సంకేతాలు ఇవ్వగలిగారు. తెలంగాణలో కెసిఆర్ పార్టీ స్థానంలో బిజెపి బలోపేతం అవుతోంది. ఇక్కడ కూడా జగన్ స్థానంలో పవన్ ను నిలపాలన్నదే చంద్రబాబు ప్లాన్. ఆర్థికంగా, సామాజికంగా, వయసుపరంగా జగన్ బలంగా ఉన్నారు. అందుకే జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అందుకే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఇబ్బందులు కలగకుండా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే ఆ ఇద్దరి నేతల కాంబినేషన్ ప్రస్తుతానికి సూపర్ సక్సెస్.