Pan India Actor: సినీ ఇండస్ట్రీ లో పని చేయడానికి అవకాశం రావడం ఒక అదృష్టం . అవకాశం వచ్చిన తర్వాత సక్సెస్ ఉన్నన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఎప్పుడైతే సక్సెస్ లేని సమయం ఎదురు అవుతుందో, అప్పుడు మొదలు అవుతుంది అసలు పరీక్ష. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఫ్లాప్స్ కారణంగా కనుమరుగు అవుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయం లో ఇది ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. కానీ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కి మాత్రం లైఫ్ బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్ట్స్ సరైన అవకాశాలను దక్కించుకోలేక, పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా వేరే పనులు చేసుకుంటూ ఉంటున్నారు. అలా ఒక ప్రముఖ పాన్ ఇండియన్ నటుడు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఒక అపార్ట్మెంట్ కి వాచ్ మ్యాన్ గా వ్యవహరించే పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఎన్టీఆర్ కోసం హెలికాప్టర్ నుండి వార్ ట్యాంకర్లు తెప్పించిన ప్రశాంత్ నీల్..!
ఆ నటుడి పేరు సావి సిద్దు. ఈయన మన టాలీవుడ్ లో నటించలేదు కానీ, బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజిత్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో ఈయన గతంలో నటించాడు. అజిత్ హీరో గా నటించిన ‘ఆరంభం’ చిత్రం లో ఇతను పోషించిన క్యారక్టర్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. చివరి సారిగా ఆయన వెండితెర మీద కనిపించిన చిత్రం ‘బేవకూఫియాన్’. 2014 వ సంవత్సరం లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత సావి సిద్దు సినిమాల్లో కనిపించడం మానేసాడు. ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్న ఇతను అకస్మాత్తుగా అందుబాటులో లేకుండా పోయాడేంటి అని చాలా మంది దర్శక నిర్మాతలు మాట్లాడుకుంటూ ఉండేవారట. అయితే అకస్మాత్తుగా ఈయన పలువురు సినీ సెలబ్రిటీలకు అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలాలో ఉండే ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కి వాచ్ మ్యాన్ గా వ్యవహరిస్తూ కనిపించాడట.
దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైన సెలబ్రిటీలు, ఇలా అయిపోయావ్ ఏంటి?, అసలు సినిమాలు ఎందుకు మానేశావ్? అని అడగ్గా, ఎంతో ప్రేమగా చూసుకునే నా భార్య ని కోల్పోవడం తో తీవ్రమైన మనోవేదనకు గురయ్యాను అని, నా భార్య చనిపోయిన కొన్నాళ్లకే తల్లిదండ్రులు కూడా చనిపోయారని, ఈ డిప్రెషన్ లో సినిమాల మీద ఫోకస్ పెట్టలేదని, కొన్నాళ్ళకు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదురు అవ్వడంతో బ్రతకడం కోసం ఇలా వాచ్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నాని చెప్పుకొచ్చాడు సావి సింధు. ఆయన మాట్లాడిన ఈ మాటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు నెటిజెన్స్. ఆయన ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎలా తయారయ్యాడో ఈ క్రింది వీడియో లో చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
Also Read: రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ని మ్యూట్ లో పెట్టాను: నాని
