Pallavi Prashanth
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ షో ముగిశాక కూడా సంచలనంగా మారాడు. డిసెంబర్ 17న అన్నపూర్ణ స్టూడియో ఎదుట కొందరు బీభత్సం సృష్టించారు. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని కార్ల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. కొన్ని ప్రైవేట్ వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. సీరియస్ అయిన పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అభిమానుల మీద కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు ఉదయం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ వీడియో విడుదల చేశాడు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాను. నేను ఫోన్ వాడటం లేదు. నేను పరారయ్యానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. జరిగిన గొడవలతో నాకు సంబంధం లేదు. నన్ను నెగిటివ్ చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కప్ కొట్టిన ఆనందం కూడా లేదంటూ వీడియో విడుదల చేశాడు.
పల్లవి ప్రశాంత్ వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు పల్లవి ప్రశాంత్ తరపున హై కోర్ట్ లాయర్ కే రాజేష్ కుమార్ వాదిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కి బెయిల్ తేవాలనే ఎఫ్ ఐ ఆర్ కాపీ కావాలి. పోలీసులు అది ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని అంటున్నారు. పల్లవి ప్రశాంత్ ఎఫ్ ఐ ఆర్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎఫ్ ఐ ఆర్ కాపీ వస్తే కానీ ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ఇన్వాల్మెంట్ ఏమిటో తెలుస్తుంది. రాష్ట్రంలో ఫ్రెండ్లి పోలీసింగ్ లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో చట్టప్రకారం వ్యవహరించకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ఆయన అన్నారు.
మా వాడిని అనవసర వివాదాల్లో ఇరికిస్తున్నారని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ బాస్ హౌస్లో గొడవలు జరిగాయి. అమర్ దీప్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతనిపై కోపంగా ఉన్నారు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఫినాలే రోజు గొడవలు జరిగాయి. ఇరువర్గాలు కొట్లాటకు దిగారు.