Prince Yawar
Prince Yawar: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి వారంలో అడుగుపెట్టిన ప్రిన్స్ యావర్ ఫినాలే వరకు వచ్చాడు. ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా షో లోకి వచ్చిన యావర్ తన నిజాయితితో కోట్లాది ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడు. తెలుగు రాకపోయినా.. ఓ తెలుగు రియాలిటీ షో లో ఇన్ని రోజులు రాణించగలిగాడు యావర్. ఇక స్పై బ్యాచ్ లో చేరడంతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. టాస్కులు పరంగా కూడా యావర్ ది బెస్ట్ అనిపించుకున్నాడు.
అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకుని టాప్ 6 లో ఒకడిగా నిలిచాడు. అయితే ఫినాలే సమయంలో యావర్ సరైన నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి ప్రశంసలు పొందాడు. కాగా హౌస్ ఉన్న ఆరుగురిలో ముందుగా అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ప్రియాంక బయటకు వచ్చేసింది. ఇక మిగిలిన టాప్ 4 కంటెస్టెంట్స్ కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. 15 లక్షలు ఆఫర్ చేయగా .. అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే చెప్పడంతో ఎలిమినేట్ అయ్యాడు.
ఆ బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు. కాగా ప్రిన్స్ యావర్ వారానికి రూ. 1. 50 లక్షలు తీసుకున్నాడని తెలిసింది. అంటే మొత్తం 15 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను రూ . 22. 5 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నాడు అని తెలుస్తోంది.
ఫినాలే లో గెలుచుకున్న రూ. 15 లక్షలు తో పాటు అతని రెమ్యూనరేషన్ మొత్తంగా చూసుకుంటే .. అతనికి రూ. 37. 5 లక్షలు వరకు యావర్ సంపాదించినట్లు తెలుస్తుంది. అయితే యావర్ తనకు అప్పులు ఉన్నట్లు .. షో కి రావడానికి ముందు లోన్ తీసుకుని వచ్చాను అని చాలా సార్లు శివాజీ తో చెప్పుకున్నాడు. అయితే షో ద్వారా వచ్చిన డబ్బు అతనికి వచ్చిన డబ్బుతో ఫైనాన్షియల్ గా కుదురుకునే అవకాశం ఉంది అని చెప్పవచ్చు