Kolikapudi Srinivasa Rao: RGV తల నరికి తెస్తే రూ.కోటి ఇస్తా.. కొలికిపూడి వ్యాఖ్యల కలకలం.. కేసుపెట్టిన వర్మ

వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ ల పాత్రలను ప్రతికూలంగా చూపించారు. ఈ విషయం ట్రైలర్ లోనే తేలింది. అవాస్తవ సంఘటనలు, అభూత కల్పనలతో తెరకెక్కించారని టిడిపి జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

Written By: Dharma, Updated On : December 27, 2023 9:18 am

Kolikapudi Srinivasa Rao

Follow us on

Kolikapudi Srinivasa Rao: రాంగోపాల్ వర్మ కు స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఇటీవల ఆయనకు టిడిపి, జనసేన శ్రేణులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్, కోర్టు సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 29న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనేక వివాదాలు ఈ సినిమాకు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమా విషయంలో ఏకంగా రామ్ గోపాల్ వర్మ కు డెత్ వార్నింగ్ రావడం విశేషం.

వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ ల పాత్రలను ప్రతికూలంగా చూపించారు. ఈ విషయం ట్రైలర్ లోనే తేలింది. అవాస్తవ సంఘటనలు, అభూత కల్పనలతో తెరకెక్కించారని టిడిపి జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాదులోని ఆర్జీవి కార్యాలయం ఎదుట ఆ రెండు పార్టీల శ్రేణులు ఆందోళన చేశాయి. సమాజానికి కంటకంగా మారిన ఆర్జీవి తలను నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓ టీవీ షో డిబేట్ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాస్ రావు కామెంట్స్ చేయడం సంచలనం రేపింది. ఓ టీవీ ఛానల్ లో వ్యూహం సినిమాపై జరిగిన డిబేట్ సందర్భంగా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి వివాదంగా మారాయి. శ్రీనివాసరావు ఒకటి కాదు రెండు సార్లు కాదు.. మూడు నాలుగు సార్లు వర్మ తల నరికి తెచ్చి ఇచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను తనను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ వర్మ.కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడని.. టీవీ హోస్ట్ సాంబశివరావు కూడా రెచ్చగొట్టేలా వ్యవహరించి పదేపదే ఆ వార్నింగ్ ఇచ్చేలా చేశాడని.. ట్విట్టర్లో చేసిన కంప్లైంట్ ను నా నుంచి వచ్చిన అఫీషియల్ కంప్లైంట్ గా భావించండి అని వర్మ పేర్కొన్నారు.