Bhairavam Movie Review : మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన ‘భైరవం’ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలు వెండితెర కి దూరమై చాలా రోజులే అయ్యింది. విడివిడిగా కం బ్యాక్ ఇస్తారని అంతా అనుకుంటే, ముగ్గురు కలిసి ఒకే సినిమా ద్వారా కం బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ బుల్లి మల్టీస్టార్రర్ కి కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మర్కెట్స్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే రీసెంట్ గానే మొదటి కాపీ సిద్ధమైంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు జరిపించబోతున్నారు. అయితే సెన్సార్ కి వెళ్లే ముందు ఈ సినిమా మొదటి కాపీ ని కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారట మేకర్స్.
Also Read : త్రివిక్రమ్ పై నా పోరాటం ఆగదు అంటూ సంచలన ఆధారాలు బయటపెట్టిన పూనమ్ కౌర్!
వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎదో పర్వాలేదు అన్నట్టుగా సినిమా సాగిపోతుందట. కానీ ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు వచ్చే ఫైట్ సన్నివేశం నుండి ఈ చిత్రం ఎక్కడికో వెళ్లిపోతుందట. సెకండ్ హాఫ్ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ విజయ్ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపాడట. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశాడట. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం లో దేవుడు పూనినట్టు విలయతాండవం చేసి విలన్స్ ని నరికి చంపే సన్నివేశం లో ఆయన నటన విశ్వరూపం చూపించాడని టాక్. ఇక నారా రోహిత్ సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో మంచి పాజిటివ్ క్యారక్టర్ చేశాడట. ఊరి కోసం, స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చే పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడని, సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా నిల్చాడని అంటున్నారు.
ఇక మంచు మనోజ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. మొదటి ఇన్నింగ్స్ లో ఆయన కేవలం హీరో పాత్రలతోనే అలరించింది. కానీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆయన విలన్ క్యారక్టర్ ద్వారా తన కెరీర్ ని పునః ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమాలో మనోజ్ నటన నెగటివ్ షేడ్స్ లో అదిరిపోయిందట. ఈ చిత్రం తర్వాత ఆయన టాలీవుడ్ విజయ్ సేతుపతి ఐపోతాడని అంటున్నారు. అంత అద్భుతంగా నటించాడట. ఇలా ఈ ముగ్గురు హీరోలు ఈ సినిమా పోతే మాకు జీవితమే లేదు అనేంతలా కష్టపడి ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా ఈ చిత్రాన్ని చేశారట. మరి ఈ ముగ్గురి హీరోలకు ఈ చిత్రం కం బ్యాక్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో 9 రోజులు ఆగాల్సిందే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.