https://oktelugu.com/

Auto Ram Prasad: గెటప్ శీను, సుధీర్ నన్నొదిలి వెళ్లిపోయారు.. ఒంటరిగా ఫీలవుతున్నా..: రాంప్రసాద్..

Auto Ram Prasad: బుల్లితెరపై కామెడీ ప్రపంచాన్ని పరిచయం చేసింది జబర్దస్త్. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే కామెడీ సీన్స్ టీవీల్లో స్కిట్ల ద్వారా ప్రసారం కావడంతో ప్రేక్షకులు ఈ షోకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఒక్క ఎపిసోడ్ వదలకుండా చూసేవారు. ఇందులో కొన్ని గ్రూపులు చేసే స్కిట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం చేసే ఫర్ఫామెన్స్ కు సాధారణ ప్రేక్షకుల నుంచి యూత్ వరకు ఫిదా అయ్యారు. ఇందులో సుధీర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2022 / 11:43 AM IST
    Follow us on

    Auto Ram Prasad: బుల్లితెరపై కామెడీ ప్రపంచాన్ని పరిచయం చేసింది జబర్దస్త్. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే కామెడీ సీన్స్ టీవీల్లో స్కిట్ల ద్వారా ప్రసారం కావడంతో ప్రేక్షకులు ఈ షోకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఒక్క ఎపిసోడ్ వదలకుండా చూసేవారు. ఇందులో కొన్ని గ్రూపులు చేసే స్కిట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం చేసే ఫర్ఫామెన్స్ కు సాధారణ ప్రేక్షకుల నుంచి యూత్ వరకు ఫిదా అయ్యారు. ఇందులో సుధీర్ టీం లీడర్ గా ఉండగా.. రాంప్రసాద్ పంచ్ లు.. గెటప్ శీను యాక్టింగ్ తో కలగలిస్తే ఆరోజు ప్రేక్షకులకు పండుగ వాతావరణమే. అందుకే ఈ టీం స్కిట్ ఎప్పుడు వస్తుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారని అంటారు.

    Auto Ram Prasad

    అయితే కాలక్రమంలో జబర్దస్త్ నుంచి నటులు బయటకు వెళ్తున్నారు. కొందరు సినిమాల్లోకి.. మరికొందరు రాజకీయాల్లోకి వెళ్లారు. ఇందులో భాగంగా సుడిగాలి సుధీర్ టీం మెంబర్స్ సుధీర్, గెటప్ శీను కూడా షో నుంచి తప్పుకున్నారు. దీంతో రాంప్రసాద్ ఒక్కడే మిగిలాడు. తాజా స్కిట్ లో రాంప్రసాద్ తన ఫ్రెండ్స్ ను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ శుక్రవారం ఎపిసోడ్ ప్రసారమైంది.. అందులో రాంప్రసాద్ మాత్రమే ఇలా కనిపించాడు. సుధీర్, గెటప్ శ్రీనులు లేరు. చోటా మోటా కమెడియన్లతో లాగించాడు. రాంప్రసాద్ మాత్రమే కాకుండా జడ్జిలు సదా, ఇంద్రజ, యాంకర్ రష్మీలు కూడా సుధీర్, గెటప్ శీనులను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. రాంప్రసాద్ అయితే ఏడుపు మొఖం పెట్టాడు.. దీంతో రాంప్రసాద్ ను అందరూ ఓదార్చారు.

    Also Read: Vikram Movie Collections: విక్రమ్ మొదటి రోజు వసూళ్లు.. కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు

    జబర్దస్త్ షో స్ట్రాట్ అయి పదేళ్లు అవుతోంది. ఇందులో ఎనిమిదేళ్లుగా సుడిగాలి సుధీర్ టీం స్కిట్లు చేస్తోంది. ప్రతీ వారం కొత్త కొత్త స్కిట్లతో టీవీల్లో కనిపించి ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు. సుధీర్ టీం మాత్రమే కాకుండా హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ఇతర టీంలు తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు జబర్దస్త్ ను వదిలి వెళుతున్నారు. దీంతో ప్రస్తుతం జబర్దస్త్ షో వెలితిగా కనిపిస్తోందని కొందరు అంటున్నారు.

    ఈ షో ప్రారంభం నుంచి జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాలు కూడా వెళ్లిపోయారు. నాగబాబు మొదట్లోనే దీనిని వదిలి జీ తెలుగు ‘అదిరింది’ షోకు వెళ్లారు. కానీ ఆ షో అనుకున్నంతగా హిట్టు కాకపోవడంతో మా టీవీలో ప్రసారమయ్యే స్టార్ కామెడీకి షిఫ్ట్ అయ్యారు. ఇక రోజా ఎమ్మెల్యేగా ఉన్న షోలో కొనసాగే వారు. కానీ ఇటీవల మంత్రి కావడంతో ఆమె జబర్దస్త్ ను వీడాల్సి వచ్చింది. మళ్లీ సినీ ఫీల్డులోకి రానని చెప్పింది. అలాగు చమ్మక్ చంద్ర, ఇతర కీలక టీం మెంబర్స్ కూడా ఈ షో ను వదిలారు.

    getup srinu-sudigali sudheer- ramprasad

    సుడిగాలి సుధీర్ టీం మెంబర్స్ లో ముఖ్యుల్లో సుధీర్, గెటప్ శీనులు జబర్దస్త్ ను వీడారు. అయితే రాంప్రసాద్ మాత్రం కొనసాగుతున్నాడు. తాజాగా చేసిన స్కిట్ లో ఎమోషనల్ అయ్యాడు. తన స్నేహితులు గెటప్ శీను, సుధీర్ లేకపోవడంతో బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అటు ప్రస్తుతం జడ్జిలుగా ఉన్న ఇంద్రజ, సదా.. యాంకర్ రష్మిలు కూడా బాధపడ్డారు. ఆ తరువాత రాంప్రసాద్ ను ఓదార్చారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ ఎమోషనల్ గా మాట్లాడారు.

    ‘నేను రైటర్ ను కదా.. నాకేం ఇబ్బంది లేదనుకున్నాను.. కానీ నా ఫ్రెండ్స్ గెటప్ శీను, సుధీర్ లేకపోవడంతో ఒంటరివాడిని అయ్యాను. వాళ్లు లేకపోవడంతో గెల్టీ ఫీలింగ్ కలుగుతోంది’ అంటూ స్టేజీపైనే ఏడ్చాడు. అటు యాంకర్ రష్మి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత రాంప్రసాద్ ను ఓదార్చిన ఇంద్రజ ‘మీ టీంకు దిష్టి తగిలినట్టుంది. అందుకే ఇంత మంచి టీమ్ ఇలా అయ్యింది..’ అని మాట్లాడింది.

    Also Read:Celebrity Sisters In Film Industry: స్టార్ సిస్టర్స్… ఈ తరం వెండితెర అక్కాచెల్లెళ్లు!

    Recommended Videos:


    Tags