Vikram Movie Collections: ఖైదీ మరియు మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒక్కరిగా మారిన లోకేష్ కనకరాజ్, కమల్ హాసన్ ని హీరోగా పెట్టి తీసిన ‘విక్రమ్’ అనే సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే..అద్భుతమైన కాస్టింగ్ తో అదిరిపొయ్యే ట్రైలర్ మరియు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో విడుదలకి ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా,ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి..కమల్ హాసన్ కి చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన మూవీ గా విక్రమ్ నిలిచింది..ఎక్కడ చూసిన రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు..తమిళం లో ఈ సినిమా ఓపెనింగ్ అజిత్ మరియు విజయ్ వంటి స్టార్ హీరోలతో సమానంగా కొట్టింది..బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కమల్ హాసన్ కి తమిళ్ లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వస్తాయి అనే విషయం మన అందరికి తెలుసు..కానీ తెలుగు లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కడమే విశేషం..చాలా కాలం తర్వాత కమల్ హాసన్ సినిమాని తెలుగు ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించేలా చేసింది విక్రమ్ మూవీ..ఈ సినిమా విడుదలకి ముందు తెలుగు లో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది..? మొదటి రోజు ఓపెనింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.
Also Read: Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ని దారుణంగా మోసం చేసిన యంగ్ హీరో
ఈ సినిమాకి మొదటి రోజు నూన్ షోస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యావరేజి గా ప్రారంభం అయ్యాయి..కానీ టాక్ అద్భుతంగా రావడం తో మ్యాట్నీస్ నుండి థియేటర్స్ గేట్ బయట హౌస్ ఫుల్ బోర్డులు పడడం ప్రారంభం అయ్యాయి..అలా షో షో కి బీభత్సమైన గ్రోత్ ని చూపిస్తూ ముందుకు దూసుకుపోయిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము..ఈ సినిమా తెలుగు రైట్స్ ని హీరో నితిన్ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..అయితే కేవలం మొదటి రోజు నుండే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వరుకు వసూలు చేసింది..అంటే కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమా కి పెట్టిన డబ్బులలో 50 శాతం కి పైగా రికవరీ వచ్చేసింది అన్నమాట..హీరో నితిన్ కి ఇది నిజంగా జాక్పాట్ అనే చెప్పాలి..ఆయన పెట్టిన 6 కోట్ల రూపాయిలను ఈ సినిమా కేవలం నైజం ప్రాంతం నుండి వసూలు చేసేట్టు ఉన్నది..ఫుల్ రన్ లో ఈ సినిమా 18 నుండి 20 కోట్ల రూపాయిల షేర్ ని కేవలం తెలుగు వెర్షన్ నుండి వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంత బాక్స్ ఆఫీస్ పరంగా ఎంత వరుకు అందుకుంటుందో చూడాలి.
Also Read: Chandrababu-NTR Family: చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్యామిలి..దూరం పెరిగిందా? అసలు కథేంటి?