Dipti Dhyani: భర్తలను హింసించే భార్యలున్న రోజుల్లో నటి దీప్తి ధ్యాని త్యాగం చూసిన జనాలు ఔరా అంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న ఆమె తన అందాన్ని పణంగా పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీప్తి లాంటి భార్య ఉన్నందుకు భర్త సూరజ్ థాపర్ చాలా అదృష్టవంతుడు అంటున్నారు. ఇంతకీ దివ్య ధ్యాని చేసిన ఆ త్యాగం ఏమిటో చూద్దాం… 2021లో కరోనా దేశాన్ని అతలాకుతలం చేసింది. లక్షల మంది ప్రజలు కరోనాతో మరణించారు. ఆసుపత్రులు రోగులతో, స్మశానాలు శవాలతో నిండిపోయాయి. కరోనా సోకిన వ్యక్తి తిరిగి కోలుకుంటాడనే నమ్మకం లేకుండా పోయింది.
దేశంలో అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ముంబై కూడా ఒకటి. సామాన్యులతో పాటు అనేక మంది సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. అలాగే నటి దివ్యా ధ్యాని భర్త సూరజ్ థాపర్ కి కరోనా సోకింది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఆ సమయంలో దీప్తి తన ఇష్ట దైవం బాలాజీకి మొక్కుకున్నారట. భర్త కోలుకొని తిరిగి వస్తే తలనీలాలు ఇస్తానన్నారట. బాలాజీ దయతో కరోనా నుండి కోలుకొని సూరజ్ ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు. ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరిగింది.
Also Read: Auto Ram Prasad: గెటప్ శీను, సుధీర్ నన్నొదిలి వెళ్లిపోయారు.. ఒంటరిగా ఫీలవుతున్నా..: రాంప్రసాద్..
ఇక బాలాజీ మొక్కును దీప్తి ఇటీవల చెల్లించారు. మొక్కులో భాగంగా గుండు చేయించుకున్నారు. గుండులో ఉన్న దీప్తి ధ్యాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2021లో సూరజ్-దీప్తి వివాహం చేసుకున్నారు. వీరికి ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో తాజా ఘటన తెలియజేస్తుంది. ఇక టెలివిజన్ నటిగా దీప్తికి మంచి పేరుంది. కైరి-రిస్తా కట్టా మీఠా, చన్ చన్ అనే సీరియల్స్ ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఈ మధ్య ఆమె కెరీర్ కొంచెం నెమ్మదించింది. అయితే భవిష్యత్తులో మంచి రోల్స్, ఆఫర్స్ వస్తాయనే విశ్వాసంతో ఉన్నారు.
Also Read:Major Movie Collections: మేజర్ మొదటి రోజు వసూళ్లు..ఇది నిజంగా ఎవ్వరు ఊహించని అరాచకం