https://oktelugu.com/

OTT Movies: ఆ మూడు సెన్సేషనల్ మూవీస్ ఓటీటీలో… ఎక్కడ చూడొచ్చంటే?

గామి ఓటీటీ హక్కులను జీ 5 దక్కించుకుంది. ప్రస్తుతం గామి జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. విశ్వక్ సేన్ అభిమానులు మరోసారి చూసి ఎంజాయ్ చేయండి. మలయాళ చిత్రం ప్రేమలు లేటెస్ట్ సెన్సేషన్.

Written By:
  • S Reddy
  • , Updated On : April 12, 2024 / 09:51 AM IST

    OTT Movies

    Follow us on

    OTT Movies: శుక్రవారం వస్తుందంటే ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం వారు మరింత వినోదం పొందనున్నారు. మూడు సూపర్ హిట్ మూవీలు ఓటీటీలోకి వచ్చేశాయి. అవేమిటో చూద్దాం. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం గామి. ఈ చిత్రంలో ఆయన అఘోరాగా నటించడం విశేషం. కొత్త దర్శకుడు విద్యాధర కాగిత తెరకెక్కించాడు. ఈ మూవీ మార్చి 8న వరల్డ్ వైడ్ విడుదలైంది. గామి థియేట్రికల్ రన్ ముగియడంతో పాటు, విడుదలై నాలుగు వారాలు అవుతుండగా ఓటీటీలో విడుదల చేశారు.

    గామి ఓటీటీ హక్కులను జీ 5 దక్కించుకుంది. ప్రస్తుతం గామి జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. విశ్వక్ సేన్ అభిమానులు మరోసారి చూసి ఎంజాయ్ చేయండి. మలయాళ చిత్రం ప్రేమలు లేటెస్ట్ సెన్సేషన్. మాలీవుడ్ లో సంచలనాలు చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. ఇక్కడ సైతం విశేష ఆదరణ దక్కించుకుంది.

    ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో విడుదల చేయడం విశేషం. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని యూత్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక ప్రేమలు చిత్రంలోని హీరోయిన్ మమిత బైజు సోషల్ మీడియాను ఊపేసింది. కాగా ప్రేమలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రేమలు చిత్ర డిజిటల్ రైట్స్ హాట్ స్టార్, ఆహా సొంతం చేసుకున్నాయి. ఆహాలో తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అవుతుంది.

    హాట్ స్టార్ లో హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేమలు స్ట్రీమ్ అవుతుంది. ప్రేమలు చిత్రానికి గిరీష్ డి దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. బ్రోచేవారెవరురా మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో మరోసారి రిపీట్ అయ్యింది. ఓం భీమ్ బుష్ మూవీ ఓటీటీలో కి త్వరగానే వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.