Maruthi Suzuki: దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకీ. దశాబ్దాలుగా ఎన్నో మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటోన్న మారుతి కార్లు అనగానే చాలా మంది లో బడ్జెట్ లో ఉండి, సామాన్యులకు అందుబాటులో ఉంటాయని అంటుంటారు.కానీ ఇటీవల కంపెనీ కొన్ని కార్ల ధరలను పెంచింది. ఇవి ప్రముఖ బ్రాండ్లు కావడం ఆసక్తిగా మారింది. అయితే అంతర్జాతీయంగా వస్తున్న కొన్ని మార్పుల కారణంగా కార్ల ధరలు పెరుగుతాయని మారుతి ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే కార్ల ధరలు పెరిగాయి. మరి ఏ కార్లపై ఎంత పెరిగాయో చూద్దాం..
మారుతి సుజుకీ నుంచి వివిధ వేరియంట్లు ఇప్పటికే టాప్ లెవల్లో ఉన్నాయి. వీటిలో స్విప్ట్ ఒకటి. రెండున్నరేళ్ల కిందట మార్కెట్లోకి వచ్చిన స్విప్ట్ ఇప్పటికీ అమ్మకాల్లో టాప్ లెవల్లో ఉంటోంది. ఈ కారుపై రూ.25,000 పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం స్విప్ట్ ధరలు రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే స్విప్ట్ కు సంబంధించిన అన్ని వేరియంట్లు పెరిగాయా? లేదా? తెలియాల్సి ఉంది. మారుతి నుంచి రిలీజ్ అయిన మరో మోడల్ గ్రాండ్ విటారా రూ.10.76 లక్షలతో విక్రయిస్తున్నారు. దీనిపై రూ.19 వేలు పెంచినట్లు తెలిపారు.
ఈ ఏడాది జనవరిలోనే కార్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా వచ్చిన మార్పులతో పాటు పెరిగిన ఇన్ ఫుట్, ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ ధరలు ఏప్రిల్ 10 నుంచి వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటికే మారుతి కార్లకు అత్యంత ఆదరణ ఉన్నాయి.అయితే ధరల పెంపుతో అమ్మకాలపై ప్రభావం చూపుతాయా? అనే చర్చ సాగుతోంది. ఈ ధరలపై వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి.