Theater Vs OTT: థియేటర్ కి ఓటిటి కి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం వల్లే సినిమాలు సరిగ్గా ఆడటం లేదా..?

నిజానికి థియేటర్లో ఒక సమూహం మొత్తం కూర్చొని సైలెంట్ గా సినిమాను చూస్తూ ఎక్కడైనా హై ఎమోషన్, ఎలివేషన్ సీన్ గాని పడితే అరుపులు, కేకలు, విజిల్స్ తో థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది. ఇక ఇలాంటి సమయంలో సగటు సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా అతనిలో తెలియని ఒక ఉత్సాహం అయితే ఉంటుంది.

Written By: Gopi, Updated On : May 14, 2024 10:35 am

Theater Vs OTT

Follow us on

Theater Vs OTT: ప్రస్తుతం థియేటర్ కి ఓటిటి కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుందనే చెప్పాలి. కొన్ని సినిమాలు థియేటర్లో సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఓటిటిలో సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఈ వ్యత్యాసం ఎక్కడ మొదలవుతుంది. ఎందుకు ఇలా థియేటర్లో ఆడిన సినిమాలు ఓటిటి లో ప్రేక్షకులను మెప్పించడం లేదు. అలాగే థియేటర్లో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు ఓటిటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిజానికి థియేటర్లో ఒక సమూహం మొత్తం కూర్చొని సైలెంట్ గా సినిమాను చూస్తూ ఎక్కడైనా హై ఎమోషన్, ఎలివేషన్ సీన్ గాని పడితే అరుపులు, కేకలు, విజిల్స్ తో థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది. ఇక ఇలాంటి సమయంలో సగటు సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా అతనిలో తెలియని ఒక ఉత్సాహం అయితే ఉంటుంది.అలాగే ఆ సీన్ ని అతడు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాడు. నార్మల్ గా ఉన్న సీన్ కూడా థియేటర్ లో ఉండే హైప్ ద్వారా చాలా హై రేంజ్ లో కనిపిస్తుంది. దానివల్ల ఆడియన్ చాలా థ్రిల్ ఫీల్ అవుతాడు. ఇక ఆ సమయంలోనే ఆ సినిమా అతనికి బాగా నచ్చుతుంది. ఇక ఆ సౌండింగ్ గాని, ఆ విజువల్ చూడటం ద్వారా అంతసేపు ప్రేక్షకుడికి ఉన్న పర్సనల్ ఇబ్బందులను మర్చిపోయి మరి ఈ సినిమాలో లీనం అయిపోయి చూస్తాడు. కాబట్టి థియేటర్లో సినిమా అనేది జన్యున్ గా ఉంటుంది. అంటే ఒక సినిమా సక్సెస్ అయితే సక్సెస్ అని, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అనే రిపోర్టులు వస్తాయి. కానీ ఓటిటి లోకి వచ్చేసరికి ఇవన్నీ ఏమీ ఉండట్లేదు.

ఒక వ్యక్తి తన మొబైల్ లో గాని లేదా టీవీలో గాని ఈ సినిమాలని చూస్తాడు. మధ్యలో అతనికి ఏదైనా పని ఉంటే కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి మరి సినిమాని చూస్తాడు. కాబట్టి అతను కన్సిస్టెన్సీగా ఆ సినిమాను చూడలేడు కాబట్టి ఆయనకి ఆ ఫీల్ అయితే రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అంత ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. నలుగురి కోసం క్రియేట్ చేసిన సీను నలుగురితో కలిసి చూసినప్పుడే మనలో కొత్త జోష్ ను నింపుతుంది. ఏ దర్శకుడైన కూడా థియేటర్లో ఒక సీన్ ఎలా పేలుతుందో ముందే తను అనుకొని విజిల్స్ ఎక్కడపడతాయి, క్లాప్స్ ఎక్కడ పడతాయి తను ఊహించి ఆ సీన్ రాస్తాడు. కానీ ఓటిటిలో మాత్రం ప్రేక్షకుడు ఒక్కడే సినిమాను చూడటం వల్ల అతను ఆ సినిమాలో అంతగా లీనమైపోయి చూడకపోయి ఉండొచ్చు. అందువల్లే ఓటిటి లో కొన్ని సినిమాలకి నెగిటివ్ టాక్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం హనుమాన్, ప్రేమలు, మంజుమల్ బాయ్స్, భ్రమయుగం, టిల్లు స్క్వేర్ సినిమాలు థియేటర్లో భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.

అలాగే సూపర్ హిట్లుగా కూడా నిలిచాయి. కానీ ఈ సినిమాలన్నీ కూడా ఓటిటిలో పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. ఇక అత్యంత ప్రెస్టేజియస్ గా తెరకెక్కిన హనుమాన్ సినిమా చూసిన ఓటిటి ప్రేక్షకులు ఇందులో సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేంత ఏముంది అంటూ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నిజానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాలోని సీన్స్ రాసుకునేటప్పుడు థియేటర్ లో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఉద్దేశించి తను సీన్ రాశారు. కాబట్టి థియేటర్లో ప్రేక్షకుడికి ఆ విజువల్స్ గాని,ఆ సౌండ్ సిస్టం గాని తెలియని ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అందువల్ల సినిమా థియేటర్లో చూసిన ప్రేక్షకుడికి హై మూమెంట్ అయితే ఇచ్చింది. కానీ ఓటిటి కి వచ్చేసరికి అది మిస్ అయిపోయింది. అందువల్ల ఇక్కడ ఇంతవరకు నెగిటివ్ టాక్ అయితే వస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ పరిస్థితి కూడా అంతే థియేటర్ లో చూసినప్పుడు ఆ గ్రాండీయర్ అద్భుతంగా ఉంటుంది.

కానీ అది ఓటిటి కి వచ్చేసరికి మిస్ అయిపోయింది. ఇలా సక్సెస్ అయిన ప్రతి సినిమా కూడా ఓటిటి లో పెద్దగా ఆడటం లేదు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా థియేటర్లో ప్లాప్ అయింది. ఓటిటిలో మాత్రం అనూహ్యంగా మంచి వ్యూయర్స్ షిప్ ను సంపాదించుకోవడమే కాకుండా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. దానికి కారణం మహేష్ బాబు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారు. అందుకే చూడడానికి బోరింగ్ లేకుండా చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి థియేటర్లో మాత్రం ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని చాలామంది విమర్శించారు. ఒక సినిమా ధియేటర్ కి ఓటిటి కి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే సినిమా ఎక్స్పీరియన్స్ వేరు ఓటిటి ఎక్స్పీరియన్స్ వేరు…