Raju Yadav OTT: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా చేసిన రాజు యాదవ్ ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ?

గెటప్ శ్రీను హీరోగా కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. రాజు యాదవ్ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. దర్శకుడు కృష్ణమాచారి కే తెరకెక్కించిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 24న విడుదలైంది.

Written By: S Reddy, Updated On : June 12, 2024 4:17 pm

Raju Yadav OTT

Follow us on

Raju Yadav OTT: జబర్దస్త్ ఎందరికో జీవితాలు ఇచ్చింది. వారిలో గెటప్ శ్రీను ఒకడు. సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్స్ లో ఒకరైన గెటప్ శ్రీను మంచి కమెడియన్. జబర్దస్త్ షోలో ఆయన వందల గెటప్స్ వేశాడు. సుడిగాలి సుధీర్-ఆటో రామ్ ప్రసాద్-గెటప్ శ్రీను లది సూపర్ కాంబినేషన్. ఏళ్ల తరబడి జబర్దస్త్ ని ఈ టీమ్ ఏలింది. హైపర్ ఆది టీమ్ వచ్చే వరకు వీరిదే హవా. ప్రస్తుతం జబర్దస్త్ లో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లేరు. ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే ఉన్నాడు. గెటప్ శ్రీను నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. అతడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

గెటప్ శ్రీను హీరోగా కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. రాజు యాదవ్ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. దర్శకుడు కృష్ణమాచారి కే తెరకెక్కించిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 24న విడుదలైంది. ఇక రాజు యాదవ్ సినిమాను గెటప్ శ్రీను గట్టిగా ప్రమోట్ చేశాడు. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. తోటి జబర్దస్త్ కమెడియన్స్ సైతం సపోర్ట్ చేశారు. రాజు యాదవ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

కాగా విడుదలై మూడు వారాలు కావస్తుంది. రాజు యాదవ్ థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఓటీటీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రాజు యాదవ్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జూన్ 22 నుండి రాజు యాదవ్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. గెటప్ శ్రీను ఫ్యాన్స్ మరోసారి రాజు యాదవ్ మూవీ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

రాజు యాదవ్ చిత్ర కథ విషయానికి వస్తే… రాజు యాదవ్(గెటప్ శ్రీను) అల్లరి చిల్లరిగా తిరిగే జులాయి. ఒకరోజు క్రికెట్ ఆడుతుంటే ముఖానికి బంతి తగిలి గాయం అవుతుంది. వైద్యం తెలియని ఓ డాక్టర్ కుట్లు వేయడం వలన రాజు యాదవ్ ముఖంలో తెలియని రియాక్షన్ మొదలవుతుంది. అతడి ముఖం నవ్వు ముఖంగా మారిపోతుంది. దాన్ని సరి చేయాలి అంటే రూ. 4 లక్షల కావాలి. అంత డబ్బు లేక అలానే నవ్వు ముఖంతో ఉండిపోతాడు. ఈ క్రమంలో స్వీటీ అనే ఓ సాఫ్వేర్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. మరి రాజు యాదవ్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? ముఖానికి ట్రీట్మెంట్ చేయించుకున్నాడా? అనేది మిగతా కథ..