Actor Darshan: హత్య కేసులో దర్శన్ పాత్ర ఏంటి? ఎందుకు రేణుకాస్వామిని చంపారు?

నటి పవిత్ర గౌడ గురించి చాలా మందికి తెలియదు. ఆమెకు వివాహం జరిగి ఒక బిడ్డ కూడా ఉంది. సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఆమె ఆ రంగంలో పెద్దగా రాణించలేకపోయింది.

Written By: Neelambaram, Updated On : June 12, 2024 5:52 pm

Actor Darshan

Follow us on

Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ తూగుదీప హత్య ఆరోపణల నేపథ్యంలో బెంగళూర్ పోలీసులు మంగళవారం (జూన్ 11) మైసూరులో అదుపులోకి తీసుకున్నారు. రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఈ నటుడిని అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకువచ్చారు.

ఏం జరిగిందంటే?
నటి పవిత్ర గౌడ గురించి చాలా మందికి తెలియదు. ఆమెకు వివాహం జరిగి ఒక బిడ్డ కూడా ఉంది. సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఆమె ఆ రంగంలో పెద్దగా రాణించలేకపోయింది. ఒకటి, రెండు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. దీంతో బొటిక్ నడిపిస్తోంది. దర్శన్ తూగుదీపతో దశాబ్దానికి పైగా సన్నిహితంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో వీరి బంధంపై రేణుకా స్వామి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత ఆయన మృతదేహం బెంగళూరులోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. త్వరలో కేసుల వివరాలను విలేకరుల సమావేశంలో వివరించే అవకాశం ఉంది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ను మైసూరులోని ఓ హోటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకు హత్య చేశారు..?
పవిత్ర గౌడపై ఆన్ లైన్ లో పలు పోస్టులు పెట్టి వేధిస్తున్నాడనే కారణంతో రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. దర్శన్ సన్నిహితుడు రేణుకా స్వామికి ఫోన్ చేసి దర్శన్ కు చెందిన మైసూర్ ఫాంహౌస్ వద్దకు రావాలని కోరాడు. అక్కడికి వచ్చిన రేణుకాస్వామిని గంటల తరబడి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి మృత దేహాన్ని బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతంలోని మురుగు కాల్వలో పడేశారు. 9వ తేదీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

దర్శన్ తూగుదీప ఎవరు?
2012లో విడుదలైన ‘అంతరు’, ‘క్రాంతివీర సంగోళి రాయన్న’ చిత్రాలతో దర్శన్ తూగుదీప నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. 1977, ఫిబ్రవరి 16న జన్మించిన దర్శన్ 2006లో ‘తూగుదీప ప్రొడక్షన్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. మొదటి చిత్రం జోతే జోతియాలు, ఇందులో దర్శన్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు.

దర్శన్ పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు. ‘క్రాంతి వీర సంగోళి రాయన్న’ చిత్రంలో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకున్నారు.