https://oktelugu.com/

NEET: నీట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఎన్టీయే సమాధానం కోసం ఆదేశం

నీట్-యూజీ 2024, పేపర్ లీకైందని దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పిటిషన్ ఆరోపించింది. పేపర్ లీకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించిందని, ఇది న్యాయమైన పద్ధతిలో పరీక్ష జరగాలని కోరుకునే వారి ప్రయోజనాలను హరించిందని కోర్టు వెల్లడించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 12, 2024 / 03:55 PM IST

    NEET

    Follow us on

    NEET: ‘పేపర్ లీక్’, ‘మాల్‌ప్రాక్టీస్’ ఆరోపణల నేపథ్యంలో నీట్-యూజీ 2024 పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నుంచి మంగళవారం (జూన్ 11) ప్రతిస్పందనను కోరింది. ‘పరీక్ష పవిత్రత ప్రభావితమైందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.’ దీనిపై ఎన్టీయే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

    నీట్-యూజీ 2024, పేపర్ లీకైందని దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పిటిషన్ ఆరోపించింది. పేపర్ లీకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించిందని, ఇది న్యాయమైన పద్ధతిలో పరీక్ష జరగాలని కోరుకునే వారి ప్రయోజనాలను హరించిందని కోర్టు వెల్లడించింది.

    కౌన్సెలింగ్‌పై స్టేకు నిరాకరణ
    కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపర ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. ‘కౌన్సెలింగ్ కొనసాగనివ్వండి, మేము కౌన్సెలింగ్‌ను ఆపడం లేదు’ అని వెకేష్ బెంచ్ న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లా వ్యాఖ్యానించారు.

    ‘పరీక్ష పవిత్రత కోల్పోయిందని, అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని వారు భావిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. జూలై 8 లోగా దీనికి సమాధానం ఇవ్వమని ఎన్టీయే కోరింది. కానీ న్యాయస్థానం కౌన్సెలింగ్‌పై ఎటువంటి ఉపశమనం ఇవ్వలేద’ అని ఫిజిక్స్ వాలా అన్నారు.

    నీట్ పరీక్షలో అవకతవకలపై పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించాయి. భారత విద్యార్థి సమాఖ్య కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. వందలాది మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నీట్ లాంటి పరీక్షలు నిర్వహించేందుకు మరింత విశ్వసనీయమైన విధానం రావాలని ఎస్ఎఫ్ఐ సభ్యుడు మరియు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు అవిజిత్ ఘోష్ అన్నారు.

    అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఓఖ్లాలోని ఎన్టీయే ప్రధాన కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించింది. కేంద్రాల వద్ద భద్రతను పెంచడం, ప్రభుత్వ కేంద్రాల వద్ద పరీక్షల నిర్వహణ, ప్రభుత్వం నియమించిన ఇన్విజిలేటర్లను మోహరించడంతో సహా ఎన్టీయే నిర్వహించే అన్ని పరీక్షల్లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.

    ఎన్టీయే జూన్ 5న నీట్-యూజీ 2024 ఫలితాలను ప్రకటించింది. 67 మంది అభ్యర్థులు 720 మార్కులు ఎలా సాధించారని విద్యార్థులు ప్రశ్నించారు. హర్యానాలోని ఒక కేంద్రం నుంచి ఆరుగురితో పాటు చాలా మంది టాపర్లుగా నిలిచారు. 2023లో 11.44 లక్షల మందితో పోలిస్తే ఈ సారి 13.16 లక్షల మంది అర్హత సాధించారు. ఆ కేంద్రం ప్రకటన అక్రమాలకు సంబంధించిన అనుమానాలను కలిగించింది.

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది.