Homeఎంటర్టైన్మెంట్ఓటీటీExtra Jabardasth: జబర్దస్త్ లవర్స్ కి గుండె బద్దలయ్యే న్యూస్... మల్లెమాల ఊహించని నిర్ణయం!

Extra Jabardasth: జబర్దస్త్ లవర్స్ కి గుండె బద్దలయ్యే న్యూస్… మల్లెమాల ఊహించని నిర్ణయం!

Extra Jabardasth: జబర్దస్త్ కామెడీ షో బుల్లితెర పై బ్రాండ్ క్రియేట్ చేసింది. ఈ షోకి వచ్చిన ఆదరణ మరో కామెడీ షోకి రాలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా 2013లో జబర్దస్త్ షో ప్రారంభం అయింది. దశాబ్దానికి పైగా హాస్య ప్రియులను అలరిస్తూ వస్తుంది. అనసూయ, రష్మీ గౌతమ్ యాంకర్లుగా… నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యహరించిన జబర్దస్త్ షో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. ఏళ్ల తరబడి టీఆర్పీలో రారాజుగా వెలుగొందింది. ఈ షో ద్వారా ఎందరో సామాన్యులను స్టార్స్ గా ఎదిగారు.

కామెడీకి కేర్ అఫ్ అడ్రస్ గా జబర్దస్త్ నిలిచింది. అయితే కొంతకాలంగా జబర్దస్త్ కుదుపులకు లోనవుతుంది. ఈ కారణంగా షోలో కామెడీతో పాటు జబర్దస్త్ కు ఉన్న డిమాండ్ కూడా తగ్గిపోతుంది. క్రమేణా ఈ షో చూసే ప్రేక్షకుల సంఖ్య పడిపోతుంది. నాగబాబు, రోజా ఉన్నప్పుడు జబర్దస్త్ ఓ వెలుగు వెలిగింది. అయితే మల్లెమాలతో విబేధాలు రావడంతో నాగబాబు షో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మంత్రి పదవి రావడంతో రోజా కూడా జబర్దస్త్ ని వీడాల్సివచ్చింది.

ఆ తర్వాత యాంకర్ అనసూయతో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది ఒక్కొక్కరిగా జబర్దస్త్ ని వీడారు. దీంతో రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. అంతగా పాపులారిటీ లేని జూనియర్ కమెడియన్స్ తో షోను నడిపిస్తున్నారు. అయితే రోజా లేని లోటుని కాస్తో .. కూస్తో ఇంద్రజ భర్తీ చేస్తుంది. కాగా ఆమె కూడా వచ్చే వారం నుంచి జబర్దస్త్ తప్పుకుంటున్నారు. ఇది ఒకింత షాక్ గురిచేసింది. ఇంతలోనే జబర్దస్త్ లవర్స్ కు మరో పెద్ద షాక్ తగిలింది.

ప్రతి గురు, శుక్ర వారాల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇకపై ఎక్స్ట్రా జబర్దస్త్ షో ను మొత్తానికే ఆపేస్తున్నారు. ఇక వచ్చే వారం నుంచి కేవలం జబర్దస్త్ మాత్రమే ఉంటుందని లేటెస్ట్ ప్రోమోలో చెప్పుకొచ్చారు. ఈ విషయం చెబుతూ యాంకర్ రష్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. కమెడియన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ట్విస్ట్ ఇస్తూ రష్మీ… కేవలం జబర్దస్త్ లో ఎక్స్ట్రా అనే పదం మాత్రమే మిస్ అవుతుంది. గురు, శుక్రవారం రెండు రోజులు జబర్దస్త్ పేరునే షో ప్రసారం అవుతుందని క్లారిటీ ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular