https://oktelugu.com/

OTT Movies: దృశ్యం కూడా ఈ థ్రిల్లర్స్ ముందు దిగదుడుపే… మైండ్ బ్లాక్ చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు!

OTT Movies మధోషి చిత్రం బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. బిపాసా బసు, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని అనేక మలుపులు ఉంటాయి. ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మధోషి చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 28, 2024 / 09:36 AM IST

    OTT Movies

    Follow us on

    OTT Movies: థ్రిల్లర్స్ కి ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరు. కథలో ఊహించని మలుపులు, సన్నివేశాలు గొప్ప అనుభూతుని పంచుతాయి. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. మోహన్ లాల్ హీరోగా దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు తెరకెక్కాయి. రెండూ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రాలను హీరో వెంకటేష్ రీమేక్ చేశారు. తెలుగు ప్రేక్షకులు సైతం దృశ్యం సిరీస్ ని ఆదరించారు. కాగా దృశ్యం కి మించిన క్రేజీ థ్రిల్లర్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అవేమిటో? ఎక్కడ చుడొచ్చో? తెలుసుకుందాం..

    మధోషి చిత్రం బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. బిపాసా బసు, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని అనేక మలుపులు ఉంటాయి. ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మధోషి చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

    సైకో బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రధాన పాత్ర చేసింది. సింగర్ కావాలనుకున్న ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కథే ఈ సైకో చిత్రం. అలరించే మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం చూడొచ్చు.

    ధూమపానానికి బానిసైన వ్యక్తి కథ నో స్మోకింగ్ మూవీ. హీరో భార్య భర్త స్మోకింగ్ మానేయాలని కోరుకుంటుంది. ఆ వ్యసనాన్ని అధిగమించేందుకు సదరు భర్త చేసే ప్రయత్నాల వలన పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారతాయి. నో స్మోకింగ్ థ్రిల్లర్ ని మనం జియో సినిమాలో చూడొచ్చు.

    ఆద్యంతం ఆసక్తి రేపే మరొక థ్రిల్లర్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్. తన స్నేహితురాలికి ఎవరు చంపారో తెలుసుకోవాలని హీరో చేసే ప్రయత్నమే పర్ఫెక్ట్ స్ట్రేంజర్. ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. పర్ఫెక్ట్ స్ట్రేంజర్ చిత్రాన్ని యూట్యూబ్ లో కూడా చూడొచ్చు.

    స్టోకర్ పేరుతో అందుబాటులో ఉంది పర్ఫెక్ట్ థ్రిల్లర్. ఈ చిత్రంలో ఓ అమ్మాయి తన కుటుంబం నేపథ్యం వివరిస్తూ ఉంటుంది. తండ్రి మరణించడంతో ఆమె మామ వరసయ్యే వ్యక్తి వద్ద ఆమె ఉంటుంది. మామ ప్రవర్తన, కుటుంబం ఒకప్పటి రహస్యాలు ఆసక్తి రేపుతాయి. స్టోకర్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

    ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది సైకలాజికల్ థ్రిల్లర్ డోంట్ సే ఏ వర్డ్. ఈ మూవీలో ఓ డాక్టర్ కూతురిని కొందరు కిడ్నాప్ చేస్తారు. కథ ముందుకు సాగే కొలది అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. డోంట్ సే ఏ వర్డ్ మూవీని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.