https://oktelugu.com/

OTT Releases this Week: ఈ వారం థియేటర్ లో, ఓటిటి లో సందడి చేస్తున్న సినిమాలు, సిరీస్ లు ఇవే…

ప్రతి సినిమా చూడటానికి ఆ సినిమాలో ఉండే కీలకమైన పాయింట్స్ ఏంటి అనే దానిమీద ప్రతి ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు ఇక అలాంటి ప్రేక్షకుల కోసమే బోలెడంత సస్పెన్స్ తో పాటు, చాలా ట్విస్టులతో వస్తున్న సినిమానే మంగళవారం...

Written By:
  • Gopi
  • , Updated On : November 13, 2023 / 03:25 PM IST
    Follow us on

    OTT Releases this Week: ప్రతి వారం తెలుగు లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో డిఫరెంట్ జానర్స్ కి చెందిన సినిమాలు ఉంటాయి…అయితే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలు, సిరీస్ లు అటు థియేటర్ లోను, ఇటు ఓటిటి లోనూ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి…ఆ సినిమాలు, సిరీస్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

    మంగళవారం…
    ప్రతి సినిమా చూడటానికి ఆ సినిమాలో ఉండే కీలకమైన పాయింట్స్ ఏంటి అనే దానిమీద ప్రతి ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు ఇక అలాంటి ప్రేక్షకుల కోసమే బోలెడంత సస్పెన్స్ తో పాటు, చాలా ట్విస్టులతో వస్తున్న సినిమానే మంగళవారం… దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్‌ రాజ్‌పూత్‌,అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ బాగుంది…ఇక నవంబరు 17న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.ఇక ఇంతవరకు రాని ఒక కొత్త పాయింట్ తో మంగళవారం సినిమాని తెరకెక్కించారని తెలుస్తుంది.ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఈ చిత్ర యూనిట్ చాలా ఆశలు పెట్టుకుంది…

    మై నేమ్‌ ఈజ్‌ శృతి…
    తెలుగు లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొంది ఆ తర్వాత అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హీరోయినే హన్సిక…హన్సిక ఇక్కడ స్టార్ హీరోలందరి నటించింది.ఇక ఆమె ప్రధాన పాత్ర లో వస్తున్న సినిమానే మై నేమ్‌ ఈజ్‌ శృతి…హన్సిక టైటిల్‌ పాత్రలో నటిస్తు వస్తున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కింది…సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తోందని తెలుస్తుంది…నవంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…

    స్పార్క్‌ లైఫ్…
    ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే చాలా ప్రామిసింగ్ గా ఉంది దాంతో ఈ స్పార్క్ లైఫ్ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి…విక్రాంత్‌ హీరోగా పాన్‌ ఇండియా రేంజ్ లో వస్తున్న చిత్రం స్పార్క్‌ లైఫ్. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది…ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేదాని పైన చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి…

    సప్త సాగరాలు దాటి సైడ్‌-బి
    చార్లీ అనే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ శెట్టి…ఇక రక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమం లోనే దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమానే సప్త సాగరాలు దాటి-బి…ఇక ఇందులో రుక్మిణీ వసంత్‌ కథానాయిక నటిస్తుంది…ఇక ఈ సినిమాకి హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు…

    అన్వేషి…
    ఇక తెలుగు లో వస్తున్న మరో వెరైటీ చిత్రం అన్వేషి…ఇక ఈ సినిమా లో విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక అనన్య నాగెళ్ల కెరియర్ కి ఈ సినిమా చాలా బాగా హెల్ప్ అవుందని ఆమె భావిస్తున్నారు. ఇక వి.జె.ఖన్నా ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అడవి నేపథ్యంలో సాగే కథ ఇది తెరకెక్కింది. ఇక ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకుంటాయి. చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడు అని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది…

    ఇక ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాలు సీరీస్ లు ఎంతో ఒకసారి తెలుసుకుందాం…

    ముందు గా అమెజాన్‌ ప్రైమ్‌లో చూసుకుంటే
    ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
    డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది.

    అపూర్వ (హిందీ) నవంబరు 15 కాగా,
    చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17 న స్ట్రీమింగ్ అవుతుంది…
    కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) నవంబరు 17 స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఇవన్నీ కూడా అమేజన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వడం విశేషం…

    ఇక అలానే మరో ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌ లో కూడా ఈ వారం చాలా సీరీస్ లు రిలీజ్ అవుతున్నాయి ఆందులో హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14 న స్టింగ్ అవుతుంది.
    బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16న స్ర్మింగ్ అవుతుంది…
    ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 16
    బిలీవర్‌2 (కొరియన్‌) నవంబరు 17
    ది డాడ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
    సుఖీ (హిందీ) నవంబరు 17
    ది రైల్వేమెన్‌ (హిందీ) నవంబరు 18 న స్ట్రీమింగ్ అవుతుంది…

    ఇక ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ తో పాటు గా బుక్‌ మై షో లో ఈ వారం చాలానే సీరీస్ లు రిలీజ్ అవుతున్నాయి…

    రాంగ్‌ ప్లేస్‌ అనే హాలీవుడ్ మూవీ కూడా నవంబరు 12 రిలీజ్ అవుతుంది.
    ది ఎగ్జార్సిస్ట్‌ అనే మరో హాలీవుడ్‌ మూవీ నవంబరు 17 న రిలీజ్ అవుతుంది…

    జియో సినిమా
    ది ఫ్లాష్‌ అనే తెలుగు సీరీస్ కూడా నవంబరు 15 న స్ట్రీమింగ్ అవుతుంది…

    ఆపిల్‌ టీవీ ప్లస్‌
    మోనార్క్‌ అనే హాలీవుడ్‌ మూవీ నవంబరు 17 న స్ట్రీమింగ్ అవుతుంది…

    ఇలా ఈ వారం కూడా సినిమా లవర్స్ కి పండగ అనే చెప్పాలి…