https://oktelugu.com/

Visakha YCP candidate: విశాఖ వైసీపీ అభ్యర్థిగా బీసీ నేత? వర్కౌట్ అవుతుందా?

విశాఖ లోక్ సభ స్థానం పరిధిలో బీసీలు అధికం. ఇందులో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. అందుకే ఈసారి బీసీ కార్డు ఉపయోగించాలని వైసీపీ భావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 13, 2023 / 03:33 PM IST

    YCP

    Follow us on

    Visakha YCP candidate: విశాఖ లోక్సభ స్థానంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నిలబెట్టుకోవాలని చూస్తుందా? బలమైన అభ్యర్థిని బరిలోదించాలని చూస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులు కావడంతో.. లోక్ సభ అభ్యర్థి ఎంపిక వైసీపీకి అనివార్యంగా మారింది. అయితే రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడం విశేషం.

    విశాఖ లోక్ సభ స్థానం పరిధిలో బీసీలు అధికం. ఇందులో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. అందుకే ఈసారి బీసీ కార్డు ఉపయోగించాలని వైసీపీ భావిస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు.. ఏకంగా మూడు లక్షల కు పైగా ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టిడిపిని మూడో ప్లేస్ లోకి పెట్టారు. ఆ గణాంకాలను చూసుకొని వైసిపి యాదవ సామాజిక వర్గాన్ని బరిలో దించాలని చూస్తోంది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019 వైసిపి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు. ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను బరిలో దించితే బీసీలంతా ఏకమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రం అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్నారు.

    మరోవైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఈమె విద్యాధికురాలు. అందుకే వైసిపి హై కమాండ్ ఆమెను నగర మేయర్ గా సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె మేయర్ గా మంచి మార్కు చూపించగలిగారు. మహిళా నేత కావడంతో కలిసి వస్తుందని వైసిపి హై కమాండ్ భావిస్తోంది. ఆమె సరైన అభ్యర్థి అవుతారని హైకమాండ్కు నివేదికలు అందుతున్నట్లు సమాచారం.

    గత ఎన్నికల్లో ఎంవివి సత్యనారాయణ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సరిగ్గా ఎన్నికల ముంగిట వైసీపీలో చేరారు. విశాఖ లోక్ సభ సీటును దక్కించుకున్నారు. వైసిపి ప్రభంజనంలో ఎంపీగా గెలుపొందారు. అయితే ఈసారి అంత ఆషామాషీ విషయం కాదు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అర్బన్ ఓటర్లు కావడం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీలు పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం తదితర కారణాలతో ఈసారి వైసీపీ గెలుపు అంత సులువు కాదు. అందుకే ఎం వివి సత్యనారాయణ ముందుగానే తప్పుకున్నారు. కానీ వైసీపీ హై కమాండ్ మాత్రం బీసీ కార్డు ఉపయోగించి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మరి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.