Homeఎంటర్టైన్మెంట్OTT Movies: 2025 సంక్రాంతి చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి, ఏది ఎక్కడ చూడొచ్చు? క్రేజీ...

OTT Movies: 2025 సంక్రాంతి చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి, ఏది ఎక్కడ చూడొచ్చు? క్రేజీ డిటైల్స్!

OTT Movies: సంక్రాంతికి టాలీవుడ్ కి అతిపెద్ద సీజన్. కాసులు కురిపించే పండగ. అందుకే సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు, హీరోలు పోటీపడతారు. 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వచ్చిన భారీ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది.

వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్. జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ కి పాజిటివ్ టాక్ దక్కింది. బ్రేక్ ఈవెన్ దాటి ఓ మోస్తరు విజయాన్ని డాకు మహారాజ్ అందుకుంది. ఇక వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పక్కా పండగ చిత్రంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని.. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఈ సంక్రాంతి చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ చిత్ర డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 14 నుండి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటించారు. ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం వంటి నటులు కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించారు.

బాలకృష్ణ చిత్రం డాకు మహారాజ్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వద్ద ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ డాకు మహారాజ్ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రాతెలా హీరోయిన్స్ గా నటించారు. డాకు మహారాజ్ ఫిబ్రవరి 9న స్ట్రీమ్ కానుందట.

సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ డిజిటల్ రైట్స్ జీ 5 సొంతం చేసుకుందట. దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న విడుదలైంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫిబ్రవరి 2వ వారం నుండి ఓటీటీలో స్ట్రీమ్ కానుందట.

RELATED ARTICLES

Most Popular