Homeఎంటర్టైన్మెంట్Sukumar: సుకుమార్ కి ఆ హీరో అంటే పిచ్చి, లెక్చరర్ జాబ్ వదిలేసి పరిశ్రమకు రావడానికి...

Sukumar: సుకుమార్ కి ఆ హీరో అంటే పిచ్చి, లెక్చరర్ జాబ్ వదిలేసి పరిశ్రమకు రావడానికి ఆయనే కారణం, ఇంట్రెస్టింగ్ స్టోరీ

Sukumar: రాజమౌళి అనంతరం రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు సుకుమార్. ఈయన సెన్సిబుల్ డైరెక్టర్. రంగస్థలం అనంతరం సుకుమార్ రేంజ్ మారిపోయింది. భారీ బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తున్నారు. ఇక పుష్ప, పుష్ప 2 సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ ని దున్నేసింది. ముఖ్యంగా హిందీలో పుష్ప 2 సరికొత్త రికార్డు నెలకొల్పింది. నార్త్ ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్ దక్కింది.

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ఏకంగా బాహుబలి 2 రికార్డు లేపేసింది. దేశంలోని టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా సుకుమార్ అవతరించారు. రాజమౌళితో ఆయన పోటీపడుతున్నారు. కాగా సుకుమార్ పరిశ్రమకు రాక ముందు, ఒక లెక్చరర్. ఈయన మ్యాథ్స్ బోధించేవారు. సుకుమార్ ఓ హీరోకి చిన్నప్పటి నుండి వీరాభిమాని అట. ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించాడు.

సుకుమార్ కి అత్యంత ఇష్టమైన హీరో ఎవరో కాదు రాజశేఖర్. సుకుమార్ చిన్నప్పటి నుండి రాజశేఖర్ ఇష్టపడేవారట. స్కూల్ లో రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ ప్రదర్శనలు ఇచ్చేవాడట. అందరూ సుకుమార్ ని మెచ్చుకునేవారట. అంతగా రాజశేఖర్ అంటే.. సుకుమార్ కి ఇష్టం అట. ఇక సుకుమార్ చిత్ర పరిశ్రమకు రావడానికి కూడా పరోక్షంగా రాజశేఖర్ కారణం అట. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు రాజశేఖర్ సమకాలీన హీరో. వారితో సమానమైన ఇమేజ్ రాజశేఖర్ కి ఉండేది.

రాజశేఖర్ నటించిన ఆహుతి, ఆవేశం, మగాడు, అంకుశం చిత్రాలంటే సుకుమార్ కి అమిత ఇష్టం అట. ఇక సుకుమార్ ఆర్య మూవీతో దర్శకుడిగా మారాడు. ఈ మూవీ అల్లు అర్జున్ కి రెండో చిత్రం. ఒక డిఫరెంట్ లవ్ బ్యాక్ డ్రాప్ తో ఆర్య తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆర్య సూపర్ హిట్ కావడంతో సుకుమార్ డెబ్యూ మూవీతోనే సత్తా చాటాడు.

ఆర్య అల్లు అర్జున్ కెరీర్ కి గట్టి పునాది వేసింది. గంగోత్రి మూవీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్.. ఆర్యతో గట్టి సమాధానం ఇచ్చాడు. అప్పటి నుండి అల్లు అర్జున్-సుకుమార్ ల బాండింగ్ కొనసాగుతుంది. సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో రామ్ చరణ్ తో చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular