Champions Trophy 2025 (9)
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ భారత్–న్యూజిలాండ్(India-Newziland) మధ్య జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. బలమైన న్యూజిలాండ్ టీమిండియా స్పిన్ వలలో చిక్కి ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్‌యాదవ్ న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో టీవీ కెమెరాల్లో ఓ అమ్మాయి మెరిసింది. అందానికే అసూయ పుట్టేలా ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యాచ్ సందర్భంగా ఆ మిస్టరీ గర్ల్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఎవరీ అమ్మాయి అని ఆరాతీశారు. చాలా మంది దుబాయ్‌లో సెటిల్ అయిన భారత అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆమె బాలీవుడ్ హీరోయిన్ అవ్‌నీత్‌కౌర్(avneeth Kour)గా కొంతమంది నెటిజన్లు గుర్తించారు. ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన అవ్‌నీత్ కౌర్ స్టేడియంలో కుర్రాళ్ల మనసు దోచేసింది.
Also Read: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్.. కంగారు ఈసారి మనకు కాదు వాళ్లకు.. ఎందుకంటే?
వర్ధమాన నటిగా…
మోడల్, డ్యాన్సర్, సినీ నటి అయిన అవ్‌నీత్‌కౌర్.. మర్ధానీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. పలు బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో నటించింది. టీవీషోలు చేస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు కూడా అవ్‌నీత్‌కౌర్ హాజరైంది. తాజాగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్(Center of Atraction)గా నిలిచింది. టీమిండియాకు మద్దతు తెలుపుతూ స్టాండ్స్‌లో సందడి చేసింది.
మ్యాచ్ సాగిందిలా..
ఇదిలా ఉంటే.. భారత్–న్యూజిలాండ్ మ్యాచ్‌లో.. టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 79 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అక్షర్ పటేల్ (61 బంతుల్లో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీశాడు. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
Also Read: టీమిండియా గెలిచింది.. దక్షిణాఫ్రికాకు రిలీఫ్.. న్యూజిలాండ్ కు దురాభారం..
లక్ష్య ఛేదనలో చతికిలపడి..
ఇక 250 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ తొలుత బాగానే ఆడినా.. భారత స్పిన్నర్ల ధాటికి 45.3 ఓవర్లకే 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కేన్ విలియమ్స్(120 బంతుల్లో 81) మినహా మరెవరూ రాణించలేదు. వరుణ్ చక్రవర్తి(5/42) ఐదు వికెట్లతో న్యూజిలాండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు.
#INDvsNZ
Hello Beauty pic.twitter.com/Y0kPGEtEMW— Prof cheems ॐ (@Prof_Cheems) March 2, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Champions trophy 2025 india new zealand match do you know who this beauty is
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com