Homeఎంటర్టైన్మెంట్Oscar Award 2023 - RRR : నక్కల వేట కాదు.. ఆస్కార్ కుంభస్థలాన్ని బద్దలు...

Oscar Award 2023 – RRR : నక్కల వేట కాదు.. ఆస్కార్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన RRR

Naatu Naatu Full Video Song (Telugu) [4K] | RRR | NTR,Ram Charan | MM Keeravaani | SS Rajamouli

 

Oscar Award 2023 – RRR : ఊహించిందే జరిగింది. జక్కన్న రాజమౌళి ప్రతిభ ప్రపంచం చవిచూసింది. ఏకంగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది..ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో “నాటు నాటు” పాటకు అకాడమీ ఆవార్డు ఫిదా అయింది. పోటీలో ఎన్ని పాటలు ఉన్నా నాటు కు జై కొట్టింది. దిస్ అవార్డు గోస్ టూ ఆస్కార్ అవార్డు అందజేసి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. యావత్ భారతదేశాన్ని సంబరాల్లో ముంచింది. అప్పుడెప్పుడో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో జయహో పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. తర్వాత ఇప్పుడు నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది.

ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ ఆర్ ఆర్ సాకారం చేసింది.. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అవార్డు సొంతం చేసుకుంది.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండు వగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీపడిన అప్లాజ్ ( టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), లిఫ్ట్ మీ అప్ ( బ్లాక్ ఫాంథర్: వకండా ఫరెవర్), దిస్ ఈజ్ ఏ లైఫ్( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి నాటు నాటు ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. ఆర్ ఆర్ ఆర్ టీం ఆనందంలో మునిగిపోయింది. అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట పాడి ఆహుతులను అలరించారు. ఆ పాటకు ఇంగ్లీష్ డ్యాన్సర్లు లయబద్ధంగా చెప్పులు వేస్తూ డాల్బీ థియేటర్ లో సందడి చేశారు.

ఈ నాటు నాటు పాట ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది.. పలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా గెలుచుకుంది. దీంతో నాటు నాటు పాట ఆస్కార్ ఎంట్రీస్ కి వెళ్ళింది. దీంతో ఈ చిత్ర యూనిట్ గత కొద్ది కాలంగా అమెరికాలో తిష్ట వేసింది. పాటకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేసింది. చిత్ర యూనిట్ ప్రచారం చేయడంతో విశేషమైన ప్రాధాన్యం లభించింది. మొత్తానికి ఆస్కార్ అవార్డుల కమిటీ కూడా గుర్తించి పురస్కారాన్ని అందజేసింది. ఈ నేపథ్యంలో రాజమౌళి అండ్ టీంకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ , మెగాస్టార్ చిరంజీవి ఇతర నటి నటులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version