Site icon OkTelugu

Oscar Award 2023 – RRR: #RRR మూవీకు ఆస్కార్ ఎలా సాధ్యమైంది? ఇదంతా అతని కృషి ఫలితమేనా!

Oscar Award 2023 – RRR: కోట్లాది మంది ఇండియన్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. మన తెలుగు సినిమా #RRR కి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో నామినేషన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.నామినేషన్స్ లోకి అయితే వచ్చాము కానీ, ఆస్కార్ అవార్డు దక్కుతుందా లేదా అనే సందేహం మరియు టెన్షన్ ప్రతీ ఒక్కరిలో ఉండేది.వాటి అన్నిటికి ఈరోజు జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేదిక తెర దించింది.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో #RRR చిత్రానికి ‘నాటు నాటు’ పాటకి గాను ఆస్కార్ అవార్డు దక్కింది.

Also Read: Oscar Award 2023 – RRR : నక్కల వేట కాదు.. ఆస్కార్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన RRR

అయితే ఈ ఆస్కార్ అవార్డు ఊరికే మాత్రమే రాలేదు.మన #RRR చిత్రానికి ముందుగానే అంతర్జాతీయ లెవెల్ లో గుర్తింపు లభించింది కానీ,ఆస్కార్ అవార్డ్స్ రావడానికి మాత్రం మూవీ టీం చాలా బలమైన క్యాంపైన్ చేసింది.పది రోజుల ముందు నుండే అమెరికా లోని ప్రతీ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చి ప్రొమోషన్స్ చెయ్యడం మనకి ఆస్కార్ అవార్డు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిల్చింది.ఇదంతా డైరెక్టర్ రాజమౌళి విజన్ వల్లే సాధ్యపడింది.’గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ వచ్చింది కదా, ఆస్కార్ కూడా అవలీలగా వచేస్తుందిలే అని ఆయన రిలాక్స్ అయిపోలేదు.దానికి తగ్గ కృషి చేసాడు,అందుకే ఇంత తేలికగా మనకి ఆస్కార్ అవార్డు వచ్చింది.ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా పేరు మారుమోగిపోయ్యేలా చేసింది.

Also Read: RRR Oscar Award 2023 : తెలుగు జాతి గర్వపడే సమయం..#RRR ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు

Exit mobile version