Oscar Awards: బరిలో ఐదుగురు.. ఉత్తమ నటుడు ఎవరో?

హాలీవుడ్ దర్శక, నిర్మాత, నటుడు బ్రాడ్లే కూపర్ ప్రధాన పాత్రలో నటించి, ఆయనే దర్శకత్వం వహించిన మాస్ట్రో సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.

Written By: Suresh, Updated On : March 3, 2024 6:06 pm

Oscar Awards

Follow us on

Oscar Awards: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు నిర్మితమవుతాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నిర్మాతకు కోట్లల్లో లాభాలను అందిస్తాయి. విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతాయి. ఇదంతా ఒకెత్తయితే తాము తీసిన సినిమాలకు ఆస్కార్ అవార్డులు రావాలని మేకర్స్ కోరుకుంటారు. ఇందులో నటీనటులు, ఇతర సాంకేతిక బృందం కూడా ఉంటారు. అయితే త్వరలో ఆస్కార్ అవార్డుల ప్రధానం ఉన్న నేపథ్యంలో.. ఈసారి ఉత్తమ నటుడి పురస్కారం ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరెవరి మధ్య పోటీ ఉందంటే..

బ్రాడ్లే కూపర్

హాలీవుడ్ దర్శక, నిర్మాత, నటుడు బ్రాడ్లే కూపర్ ప్రధాన పాత్రలో నటించి, ఆయనే దర్శకత్వం వహించిన మాస్ట్రో సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బ్రాడ్లే కూపర్ నటనకు గానూ 96వ ఆస్కార్ అవార్డుల్లో ఆయన ఉత్తమ నటుడికి నామినేట్ అయ్యారు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో “సిల్వర్ లినింగ్స్ ప్లే బుక్”, “అమెరికన్ స్పిన్నర్”, ” ఏ స్టార్ ఇస్ బర్న్” ఇలాంటి చిత్రాలకు ఆయన గతంలో నామినేషన్స్ దక్కించుకున్నారు. మాస్ట్రో సినిమా అద్భుతమైన సంగీత నేపథ్యంతో కూడిన ప్రేమ కథగా రూపొందింది. హాలీవుడ్లో గత ఏడాది టాప్ టెన్ చిత్రాల్లో నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే పలుమార్లు ఆస్కార్ నామినేషన్స్ లు దక్కించుకున్న కూపర్.. ఈసారైనా మాస్ట్రో సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు దక్కించుకుంటారో, లేదో చూడాలి.

పాల్ గియా మెట్టి

“ది హాల్డో వర్స్”.. హాలీవుడ్లో సంచలనచిత్రం గా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో పాల్ గియా మెట్టి కథానాయకుడి పాత్ర పోషించాడు. ఈసారి ఎలాగైనా ఆస్కార్ దక్కించుకోవాలని కసితో ఉన్నాడు. గత 18 సంవత్సరాలుగా ఆస్కార్ బరిలోకి దిగాలనే అతడి కలను “ది హాల్డో వర్స్” ఏడాది నిజం చేసింది. పాల్ గియా మెట్టి 30 సంవత్సరాలుగా సినీ రంగంలో ఉన్నాడు. ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించాడు. పలు సినిమాల్లో పోషించిన పాత్రలే. పాల్ గియా మెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. 2006లో ఆస్కార్ అవార్డు రేసులో సహాయ నటుడిగా
పాల్ గియా మెట్టి నామినేట్ అయ్యారు. “ది హాల్డో వర్స్” సినిమా పై గియామెట్టి చాలా అంచనాలే పెట్టుకున్నాడు. మరి ఈసారి అతడి కల నెరవేరుతుందో? లేదో? చూడాలి.

క్రిస్టోఫర్ నోలన్

ఓపెన్ హైమర్ సినిమాతో క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ లో ఈసారి పెద్ద చరిత్రే సృష్టించాడు. ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను క్రిస్టోఫర్ నో లన్ రూపొందించాడు. ఐమాక్స్ కెమెరాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిలియాన్ మర్ఫీ ముఖ్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఆయన నటనకు గానూ గోల్డెన్ గ్లోబ్, బాప్టా, స్క్రీన్ యాక్టర్స్ గిల్ట్ పురస్కారాలు లభించాయి. దాదాపు 13 నామినేషన్లతో ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో దూసుకుపోతోంది. క్రిస్టోఫర్ నోలన్.. తనకు ఉత్తమ నటుడి పురస్కారం కచ్చితంగా లభిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

కోల్మాన్ డోమింగో

హాలీవుడ్లో బయోగ్రాఫికల్ డ్రామాగా రస్టిన్ అనే చిత్రం గత ఏడాది సంచలన విజయం సాధించింది. సామాజిక హక్కుల కార్యకర్త బయార్డ్ రస్టిన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రలో కోల్మాన్ డొమింగో నటించారు. ఈ చిత్రాన్ని జార్జ్ సి వూల్ఫ్ తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన.. డొమింగో ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

జెఫ్రీ రైట్

అమెరికన్ ఫిక్షన్ అనే కామెడీ డ్రామా సినిమాలో జెఫ్రీ రైట్ కథానాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మాంక్ అనే పాత్రలో జెఫ్రి నటించారు.. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది విడుదలైన టాప్ టెన్ సినిమాల్లో అమెరికన్ ఫిక్షన్ కూడా ఉంది. ఈ సినిమా లో నటనకు గానూ జెఫ్రీ బ్లాక్ ఫిలిం క్రిటిక్ సర్కిల్, ఆలియన్స్ ఆఫ్ ఉమెన్ ఫిలిం జర్నలిస్ట్ వంటి పురస్కారాలు దక్కించుకున్నాడు. తొలిసారి నామినేషన్ పొందిన జెఫ్రీ ఆస్కార్ అందుకుంటాడో? లేదో? చూడాల్సి ఉంది. కాగా, మార్చి 11న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.