https://oktelugu.com/

Chandrababu: పవన్ ను మార్చిన బాబు

అయితే ఇప్పుడు పవన్ చెప్పినట్టు అవుతుందా? చంద్రబాబు చెప్పినట్టు పవన్ నడుచుకుంటున్నారా? ఈ రెండు ప్రశ్నలతో జనసైనికులు సతమతమవుతున్నారు. 24 అసెంబ్లీ స్థానాలకు పవన్ ను ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 3, 2024 5:57 pm
    Chandrababu

    Chandrababu

    Follow us on

    Chandrababu: పవన్ కళ్యాణ్ పై జన సైనికులకు అంతులేని నమ్మకం. మార్పు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వారు బలంగా నమ్ముతారు. ఈ రాష్ట్రాన్ని శాసించగలిగిన నాయకుడని భావిస్తారు. అటు పవన్ సైతం అదే మాటలను చెప్పుకొస్తారు. 2014లో చంద్రబాబును అధికారంలోకి తెచ్చింది తానేనని పలు సందర్భాల్లో పవన్ తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో తనను విమర్శించారు గనుక చంద్రబాబు ఓడిపోయారని కూడా చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో జగన్ సైతం అదే మాదిరిగా గద్దె దించుతానని పవన్ ఇప్పుడు సవాల్ విసురుతున్నారు. పాతాళానికి తొక్కేస్తానని కూడా హెచ్చరిస్తున్నారు.

    అయితే పవన్ ఆ స్థితిలో ఉన్నారా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో మాటలు చెప్పుకొచ్చారు. మరెన్నో ప్రకటనలు కూడా చేశారు. రాజ్యాధికారం సాధించబోతున్నామని ప్రకటించారు. శాసనసభలో మన ప్రాతినిధ్యం పెరుగుతుందని కూడా బలంగా చెప్పుకొచ్చారు. జనసేన అనుకున్నదే అవుతుంది అని.. జనసేన లేని ప్రభుత్వం ఉండదని కూడా తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా లభించిన 24 అసెంబ్లీ సీట్లతో అది సాధ్యమవుతుందా? పవన్ చెప్పినట్టు శాసించగలమా? అని జనసైనికులు లోలోపల ప్రశ్నించుకుంటున్నారు.

    అయితే ఇప్పుడు పవన్ చెప్పినట్టు అవుతుందా? చంద్రబాబు చెప్పినట్టు పవన్ నడుచుకుంటున్నారా? ఈ రెండు ప్రశ్నలతో జనసైనికులు సతమతమవుతున్నారు. 24 అసెంబ్లీ స్థానాలకు పవన్ ను ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ సీట్లే జనసేనకు ఎక్కువ అన్నట్లు అదే పవన్ తో ప్రకటించగలిగారు. బలానికి తగ్గట్టు సీట్లు అడుగుతామని పవన్ తో చెప్పించగలిగారు. అదే జనసేన బలం అన్నట్లు ఒప్పించగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ ను చంద్రబాబు తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పవన్ బలవంతుడన్న నమ్మకం మాట అటుంచి.. చంద్రబాబు వద్ద బలహీనం అయ్యారన్న బాధ జనసైనికుల్లో కనిపిస్తోంది. కానీ అధినేత మాట శిరసావహించి ముందుకు సాగుతున్నారు జన సైనికులు.