Oscar Awards 2022: ‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఒకవేళ ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. మొత్తమ్మీద అందమైన అబద్దపు సామ్రాజ్యంలో ఆస్కార్ అందమైన యువరాణిలా అందర్నీ ఊరిస్తూ ఉంటుంది.
ఆస్కార్ అంత అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టే… మన ఇండియన్ సినిమాలు కూడా పోటీపడుతూ ఉంటాయి. నిజానికి ప్రతి సంవత్సరం జస్ట్ నామినేషన్ లలోకి మన ఇండియన్ సినిమా వెళ్ళింది అంటేనే.. ఆ సినిమా కచ్చితంగా గొప్పది అయి ఉంటుందని ఫీల్ అయ్యేంతగా ఆస్కార్ ను పరిగణలోకి తీసుకుంటారు మన వాళ్ళు. అందుకే ఇండియాలో కూడా ప్రతి ఆస్కార్ అవార్డు పై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ సారి కూడా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది.
Also Read: సావిత్రి జీవితంలో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఆమె మోసపోయింది..
మరీ 2022: ఆస్కార్ బరిలో నిలిచాయి రెండు భారతీయ చిత్రాలు. తమిళం నుంచి ‘జై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 94వ ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించిన ఈ చిత్రాలు ఫైనల్ నామినేషన్స్ జాబితాలో నిలుస్తాయా? లేదా అనేది ఫిబ్రవరి 8న తెలుస్తుంది. మరోవైపు ఉత్తమ విదేశీ విభాగంలో భారతదేశం నుంచి తమిళ చిత్రం ‘కూళాంగల్’ కూడా నామినేట్ అయింది. అయితే, అ సినిమాకు నిరాశ ఎదురైంది.
“జై భీమ్” సినిమా… ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన సినిమా. దైవం మానుష రూపేణ అన్నారు. ఇది సమాజం మరువకూడదు, ఇదే అంశాన్ని చెప్పిన సినిమా ఇది. మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రు జీవితం ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా ఇది.
మరక్కర్: 16వ శతాబ్దానికి చెందిన నావికుడు కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా. ఈ చిత్రం 67వ నేషనల్ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో (బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులను అందుకుంది.
Also Read: ఏపీ సర్కార్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ టీచర్స్.. సమ్మెలో సై