https://oktelugu.com/

Movie Time: మూవీ టైమ్ : ‘నాని’ నుంచి గుడ్ న్యూస్.. సంపూ నుంచి ‘ధగడ్ సాంబ’ !

Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హీరో నాని తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘అంటే సుందరానికి!’ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని నాని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌ గా కనిపించనుంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ డైరెక్టర్. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 24, 2022 / 12:54 PM IST
    Follow us on

    Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హీరో నాని తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘అంటే సుందరానికి!’ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని నాని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌ గా కనిపించనుంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ డైరెక్టర్. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ ఉంది.

    ante sundaraniki

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘ధగడ్ సాంబ’. తాజాగా ఈ సినిమాలోని భోళా శంకర్ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ధనుంజయ్, దాసరి ఐశ్వర్య పాడిన ఈ పాటకు డేవిడ్ మ్యూజిక్ అందించారు. ఎన్ ఆర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై బిఎస్.రాజు నిర్మిస్తున్నారు.

    Also Read: Oscar Awards 2022: ఆస్కార్‌ బరిలో నిలిచిన భారతీయ చిత్రాల లిస్ట్ !

    ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఓ గొప్ప స్థాయికి తీసుకొచ్చారని, రాబోయే రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి అద్భుతంగా సాగుతోందన్నారు.

    Also Read: ట్రెండింగ్: అంతుచిక్కని సమంత వ్యవహారం..

    Tags