Orange Re Release Collection: ఒకప్పుడు డిజాస్టర్ అయినా సినిమాలు, రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవడం చాలా సర్వసాధారణమైన విషయం గా మారిపోయింది. ముఖంగా ‘ఆరెంజ్'(Orange Re Release) చిత్రం గురించి మాట్లాడుకోవాలి. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రం తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) చేసిన లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ పాటల కారణంగా అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎంతలా అంటే ఆ చిత్ర నిర్మాత నాగబాబు నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు చేసే రేంజ్ ఫ్లాప్ అన్నమాట. ఆ ఫ్లాప్ చిత్రమే ఇప్పుడు నాగబాబు పాలిట అక్షయ పాత్ర లాగా మారింది. మొదటిసారి రీ రిలీజ్ చేసినప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఆ తర్వాత సందర్భానుసారంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. రిలీజ్ అయిన ప్రతీసారి ఈ చిత్రం నాగబాబు కి లాభాల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ చిత్రాన్ని మూడవసారి రీ రిలీజ్ చేశారు. ఈసారి మొదటి రెండు సార్లు రిలీజ్ చేసినప్పుడు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో, ఇప్పుడు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజు పాతిక వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి, అదే విధంగా రెండవ రోజున 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కేవలం బుక్ మై షో యాప్ లోనే ఈ చిత్రానికి రెండు రోజుల్లో 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్ట్ యాప్ ని కూడా కలుపుకొని చూస్తే అక్షరాలా ఈ చిత్రానికి 70 వేలకు పైగా టికెట్స్ ఈ రెండు రోజుల్లో అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా మొదటి రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో మొదటి రెండు రీ రిలీజ్ ద్వారా వచ్చిన గ్రాస్ వసూళ్లను కలుపుకొని, ఈ చిత్రానికి టోటల్ గా ఇప్పటి వరకు 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వాలెంటైన్స్ డే వరకు ఈ చిత్రానికి రన్ ఉండే అవకాశం ఉండడం తో మరో రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
