Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor)..ఈ పేరు ని చూస్తే మన భారతీయులు గర్విస్తుంటే, మరో పక్క పాకిస్తాన్ కి ఈ పేరు ని చూస్తేనే ముచ్చమటలు పడుతాయి. ప్రపంచం మొత్తం మీద శాంతి దూతగా పిలవబడే భారత్ రణరంగం లోకి దిగితే ఎలా ఉంటుందో చాటి చెప్పిన గొప్ప ఆపరేషన్ ఇది. పెహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీ కారంగా, పాకిస్థాన్ లో 9 ప్రాంతాల్లో ఉంటున్న ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి, మన ఇండియన్ ఆర్మీ పవర్ ని తెలిపిన గొప్ప ఆపరేషన్ ఇది. ఎంతో మంది సతీమణులు తమ కళ్ళ ముందే భర్తలను పోగొట్టుకొని ఏడుస్తుంటే, వాళ్ళ కన్నీళ్లకు సమాధానం గా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పెట్టిన పేరు ఇది. ప్రపంచం మొత్తం మారుమోగిపోతున్న ఈ పేరు తో కచ్చితంగా సినిమాలు భవిష్యత్తులో వస్తాయని మనమంతా అనుకున్నాము.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
అనుకున్నట్టుగానే దర్శక నిర్మాతలు ఈ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మహావీర్ జైన్ ఫిలిమ్స్ ఈ టైటిల్ ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేసే రేస్ లో ముందు వరుసలో ఉంది. అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్ కోసం పోటీ పడుతున్నాడు. మరోపక్క జీ స్టూడియోస్, టీ సిరీస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఈ టైటిల్ కోసం క్యూలో నిల్చున్నాయి. అలా పోటీ పడుతున్న ఈ బ్యానర్స్ అన్నిటి లక్ష్యం ఒక్కటే, ‘ఆపరేషన్ సింధూర్’ పై ఒక సినిమా చేయాలనీ. ఇప్పటి వరకు మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో జరిగిన యదార్ధ సంఘటనలను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలను తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. అవి కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సునామీ నే నెలకొల్పాయి.
‘URI’, ‘అమరన్’, ‘మేజర్’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయి. అదే తరహాలో ప్రపంచం మొత్తానికి మన ఇండియన్ పవర్ తెలిసేలా చేసిన ఈ ఆపరేషన్ పై సినిమా తీస్తే వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని దర్శక నిర్మాతల అభిప్రాయం. వాస్తవానికి ‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా ముగిసిపోలేదు. పాకిస్తాన్ ఆర్మీ మనల్ని ఇప్పటికీ కవ్విస్తూనే ఉన్నాయి. గడిచిన మూడు రోజుల్లో 50 కి పైగా మిస్సైల్స్ ని మన దేశం లోని 16 పాపులర్ సిటీస్ పై దాడికి వదిలారు. కానీ ఎంతో పరమత్తంగా ఉన్న మన ఇండియన్ ఆర్మీ వాటిని గాల్లో ఉన్నప్పుడే పేల్చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ మళ్ళీ రీ యాక్టీవ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏ క్షణంలో అయినా పాకిస్తాన్ పై మనోళ్లు దాడికి వెళ్లొచ్చు. కాబట్టి ఈ ఆపరేషన్ పూర్తిగా ముగిసేవరకు దర్శక నిర్మాతలు సినిమా మొదలు పెట్టరట కానీ, టైటిల్ కోసం మాత్రం ఇప్పటి నుండే పోటీ ఒక రేంజ్ లో ఏర్పడింది.