S 400 Defence System: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్థాన్ మళ్లీ భారత్‌పై దాడికి దిగింది. దేశ సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై పాక్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో దాడి చేయగా.. ఇండియన్ సైన్యం వాటిని నాశనం చేసింది. భారతదేశ త్రివిధ దళాలు ఒక్కసారిగా రంగంలోకి దిగి అన్ని విధాలుగా పాక్‌ను అడ్డుకుంటుంది. పాక్‌లోని కొన్ని ప్రధాన నగరాలపై వైమానిక దాడులు చేయడంతో పాటు పాక్ ఆయువుపట్టు అయిన కరాచీ పోర్టుపై కూడా INS విక్రాంత్‌తో దాడి చేసింది. ఈ పోర్టు మొత్తం నాశనం అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే పాక్ క్షిపణులు భారత్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో భారత సైన్యం S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో క్షిపణులను నాశనం చేసింది. వెంటనే పాక్‌కి సంబంధించిన అన్ని క్షిపణులను భారత్ నాశనం చేసింది. మరి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకతలేంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: ఆపరేషన్ సిందూర్.. ఇప్పటికీ ఆయన ప్రసంగమే స్ఫూర్తిదాయకం..
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
సరికొత్త టెక్నాలజీ ఉన్న దీన్ని భారత్ రష్యా నుంచి దిగుమతి చేసింది. ఈ S-400 ట్రయంఫ్ అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. దీనిని భారత్‌లో సుదర్శన్‌గా పిలుస్తారు. ఇది దాదాపుగా 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను గుర్తిస్తుంది. గంటకు 17 వేల కి.మీ వేగంతో దూసుకెళ్లి.. ఎలాంటి క్షిపణులను అయినా కూడా అడ్డుకుంటుంది. ఒకేసారి ఎన్ని డ్రోన్‌లు ఎటాక్ చేసినా కూడా ఈజీగా తిప్పికొడుతుంది. ఒకేసారి 80 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. దీంతో పాటు 36 క్షిపణులను ఈ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొడుతుంది. అలాగే ఇది 360 డిగ్రీల కవరేజ్‌లో వర్క్ అవుతుంది. ఎటు వైపు నుంచి దాడి వచ్చినా కూడా వాటిని ఈజీగా పసిగట్టేస్తుంది. వీటితో పాటు స్టెల్త్ టెక్నాలజీ క్షిపణులను కూడా గుర్తించి వాటిని ఈజీగా తిప్పికొడుతుంది. అయితే పాక్ దాడికి పాల్పడిన అన్ని క్షిపణులు కూడా చైనావే. వీటిని భారత్ సునాయాసంగా తిప్పికొట్టింది.
నిజానికి భారత్ యుద్ధానికి దిగడం లేదు. దీనికి నిదర్శనం.. ఆపరేషన్ సిందూర్. కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసి పాక్‌పై భారత్ దాడికి పాల్పడింది. కానీ పాక్ మాత్రం యుద్ధానికి దిగుతోంది. మనుషులు తిరిగే ప్రదేశాలు అయిన జమ్మూ, రాజస్థాన్‌లో దాడులకు పాల్పడుతోంది. భారత్ వ్యూహాత్మకంగా వాటిని S-400తో చిత్తు చేస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి.. శాంతిని కోరుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత యుద్ధానికి దిగవద్దని పాక్‌కు అంతర్జాతీయ దేశాలు తెలిపాయి. కానీ పాక్ వాటిని పట్టించుకోకుండా మళ్లీ భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. పాక్ ఏ మాత్రం తగ్గకుండా యుద్ధానికి సై అంటే ఇక భారత్ చేతిలో పాక్ నాశనం కావడం గ్యారెంటీ అని పలువురు అంటున్నారు.