Electric Scooter : ముంబైకి చెందిన ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ‘హైఫై’ పేరుతో తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.42,000 (ఎక్స్-షోరూమ్). ఒడిస్సీ హైఫై లో స్పీడ్ కలిగిన ఈ-స్కూటర్. పెట్రోల్ స్కూటర్ల అధిక ఖర్చుల నుంచి ప్రయాణికులను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 89 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తక్కువ వేగం కారణంగా దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) కూడా అవసరం లేదు.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం!
4 గంటల్లో ఛార్జ్
ఒడిస్సీ హైఫైలో 250 వాట్ల మోటార్ అమర్చబడి ఉంది. దీనికి 48 వోల్ట్స్ లేదా 60 వోల్ట్స్ బ్యాటరీ వస్తుంది. ఈ సెటప్‌తో ఈ-స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల నుండి 89 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. బ్యాటరీని 4 నుంచి 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
ఫీచర్స్
హైఫైలో కీ లేకుండా స్టార్ట్ చేసే ఫీచర్, స్టార్ట్/స్టాప్ బటన్ ఉంది. సిటీ డ్రైవింగ్, రివర్స్, పార్కింగ్ కోసం వేర్వేరు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. దీనితో పాటు సీటు కింద స్టోరేజ్, క్రూజ్ కంట్రోల్, అవసరమైన సమాచారాన్ని చూపించే ఎల్‌ఈడీ డిజిటల్ మీటర్ కూడా ఉంది. ఈ ఈ-స్కూటర్ రాయల్ మ్యాట్ బ్లూ, సెరామిక్ సిల్వర్, అరోరా మ్యాట్ బ్లాక్, ఫ్లేర్ రెడ్, జెడ్ గ్రీన్ అనే 5 రంగుల్లో అందుబాటులో ఉంది.
ఒడిస్సీ హైఫై ఈ-స్కూటర్ మే 10, 2025 నుండి ఒడిస్సీ డీలర్‌షిప్ నెట్‌వర్క్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుంది. ప్రారంభ కొనుగోలుదారులు స్పెషల్ డిస్కౌంట్స్, వారంటీ బెనిఫిట్స్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ భారతీయ మార్కెట్‌లో ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, హీరో, హోండా తక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు పోటీనిస్తుంది.
Also Read : పెట్రోల్‌కు చెక్ పెట్టేయండి.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో భారీగా ఆదా చేయండి