https://oktelugu.com/

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబానికి 47 కోట్ల రూపాయిల మోసం.. నెట్ ఫ్లిక్స్ సంస్థ పై కేసు నమోదు!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది యూజర్లు కలిగియున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు మన భారత దేశంలో కూడా ఈ ఓటీటీ ని మిలియన్ల కొద్దీ యూజర్లు వినియోగిస్తుంటారు. ప్రస్తుతం అన్ని భాషలకు సంబంధించిన క్రేజీ సినిమాలు మొత్తం ఇందులో విడుదల అవుతుంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 27, 2024 / 08:44 PM IST

    Rakul Preet Singh(1)

    Follow us on

    Rakul Preet Singh: లాక్ డౌన్ సమయం లో ప్రేక్షకులు ఇంట్లోనే ఉండడం వల్ల ఓటీటీ లకు బాగా అలవాటు పడిన సంగతి అందరికీ తెలిసిందే. మన భారత దేశం లో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, సోనీ లైవ్ వంటి టాప్ ఓటీటీ యాప్స్ ని వాడుతుంటారు వినియోగదారులు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది యూజర్లు కలిగియున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు మన భారత దేశంలో కూడా ఈ ఓటీటీ ని మిలియన్ల కొద్దీ యూజర్లు వినియోగిస్తుంటారు. ప్రస్తుతం అన్ని భాషలకు సంబంధించిన క్రేజీ సినిమాలు మొత్తం ఇందులో విడుదల అవుతుంటాయి. #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా అత్యధిక రీచ్ రావడం, ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా దక్కడానికి కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థనే కారణం. అందుకే ఇప్పుడు మన మేకర్స్ తమ సినిమాలను ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్ముతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ పై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, అలాగే ఆమె మావయ్య వాషు భగ్నానీ కోర్టు లో కేసు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ బాలీవుడ్ లో హీరో నెంబర్ 1 , మిషన్ రాణి గంజ్ మరియు చోటే మియా బడే మియా వంటి చిత్రాలను నిర్మించారు.

    ఈ మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. అయితే విడుదలకు ముందే ఈ మూడు సినిమాలను నెట్ ఫ్లిక్స్ సంస్థ కి అమ్మేసారు. ఒప్పందం ప్రకారం ఈ మూడు సినిమాలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి 47 కోట్ల రూపాయిలు రావాల్సి ఉందట. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని, న్యాయ విచారణ చేపట్టి తమకు రావాల్సిన 47 కోట్ల రూపాయిలను ఇప్పించాల్సిందిగా కోరారు. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ మాత్రం ఈ కేసు ని కోర్టు కొట్టేసింది అని చెప్పుకొచ్చారు. ఈ మూడు సినిమాలు ఒప్పందం ప్రకారమే ఆయా నిర్మాతలకు డబ్బులు చెల్లించామని, అంతకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

    దీంతో జాకీ భగ్నానీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఎలాంటి పోరాటం చేయబోతున్నాడో చూడాలి. గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేసుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక జాకీ భగ్నానీ కి ఏమాత్రం కలిసి రావడం లేదు, వ్యాపారాల్లో మొత్తం నష్టాలే. మరోపక్క రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా ఏ ఇండస్ట్రీ లో సరైన అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ రామాయణం లో ‘సూర్పనక్క’ పాత్ర ని పోషిస్తుంది. టాలీవుడ్ లో ఈమెకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు, అలా పెళ్లి తర్వాత ఈ జంట తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో మునిగిపోయింది.