Open Heimer Collections : ఓపెన్‌హైమర్’ కి డిజాస్టర్ వసూళ్లు..నోలన్ ఇలా దొరికేశాడేంటి!

ఓపెన్ హీమెర్ చిత్రానికి నాలుగు రోజులకు గాను కేవలం 66 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. బహుశా నోలన్ కి ఇలాంటి ఫ్లాప్ సినిమా గడిచిన దశాబ్దం నుండి తగలలేదు అనే చెప్పాలి.

Written By: Vicky, Updated On : July 23, 2023 8:02 pm
Follow us on

Open Heimer Collections : ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద క్రిస్టొఫర్ నోలన్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈయన సినిమా వచ్చిందంటే భాషతో సంబంధమే ఉండదు, ఆడియన్స్ ఎగబడి వెళ్ళిపోతారు. తెలుగురాష్ట్రాల్లో కూడా ఈయనకి ఉన్న క్రేజ్ వేరే. ముఖ్యంగా సిటీస్ లో అయితే మన స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఉంటుంది ఈయనకికొన్ని రురల్ ప్రాంతాలలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉంటుంది.

ఆయన గత చిత్రం ‘టెనెట్’ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన చిత్రం ‘ఓపెన్‌హైమర్’. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ వచ్చింది. ఆటం బాంబు పేల్చే సన్నివేశం తప్ప, మిగిలిన సినిమా మొత్తం డైలీ సీరియల్ ని సాగదీసినట్టు తీసారని. ఇది నోలన్ రేంజ్ సినిమా అసలు కాదంటూ రివ్యూస్ రాసారు.

ఈ సినిమాతో పాటుగా హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ మార్గట్ రాబీ నటించిన ‘బార్బీ’ అనే చిత్రం కూడా విడుదలైంది. నోలన్ సినిమా కి పోటీ గా వస్తుంది, ఎంత ధైర్యం అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేసేవాళ్ళు నెటిజెన్స్. కానీ నోలన్ సినిమా కి డిజాస్టర్ వసూళ్లు వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.

‘బార్బీ’ చిత్రానికి వస్తున్న వసూళ్ళలో, ఓపెన్ హీమెర్ కి సగం కూడా రాలేకపోతుండడం విశేషం. బార్బీ చిత్రానికి మొదటి నాలుగు రోజులకు కలిపి 100 మిలియన్ డాలర్ల వసూళ్లు రాగా, ఓపెన్‌హైమర్ చిత్రానికి నాలుగు రోజులకు గాను కేవలం 66 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. బహుశా నోలన్ కి ఇలాంటి ఫ్లాప్ సినిమా గడిచిన దశాబ్దం నుండి తగలలేదు అనే చెప్పాలి. ఫుల్ రన్ లో కూడా ఈ సినిమాకి వసూళ్లు అంత గొప్పగా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు, చూడాలి మరి.