https://oktelugu.com/

Vikram Thangalaan: తంగలన్ సినిమాతో ఆస్కార్ ను టార్గెట్ చేసిన విక్రమ్…

Vikram Thangalaan: విక్రమ్ హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ని చూపించే విధంగా సినిమాలు చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 4, 2024 / 12:23 PM IST

    Vikram targeted Oscar with Thangalaan Movie

    Follow us on

    Vikram Thangalaan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడంలో కమలహాసన్ తర్వాత అంతటి గొప్ప పేరును సంపాదించుకున్న నటుడు విక్రమ్…ఈయన హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ని చూపించే విధంగా సినిమాలు చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో అయితే తెరకెక్కుతు ఉంటుంది.

    మరి ఇలాంటి సమయంలోనే ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎంతో కొంత వైవిధ్యానైతే చూపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా పా రంజిత్ డైరెక్షన్ లో ‘తంగలన్ ‘అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాతో విక్రమ్ కి తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే విక్రమ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇంతకుముందు నాన్న, ఐ సినిమాలు కోసం విపరీతంగా కష్టపడ్డాడు. అయినప్పటికీ అవి సక్సెస్ లను మాత్రం సాధించలేకపోయాయి. కాబట్టి విక్రమ్ ఎంత కష్టపడినా కూడా ఆయనకు దక్కాల్సిన ప్రతిఫలం అయితే దక్కడం లేదు. ఇక ఈ సినిమాతో అయిన కమర్షియల్ సక్సెస్ ని అందుకొని అవార్డుల పరంగా కూడా విక్రమ్ కి సరైన న్యాయం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది… ఇక గతంలో శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘అపరిచితుడు’ సినిమా తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే లేదు.

    ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ కి అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆపరిచితుడు సినిమా 2005 వ సంవత్సరంలో వచ్చింది. ఆ సినిమా వచ్చి దాదాపు 19 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ సరైన సక్సెస్ లేకపోయిన కూడా ఆయన ఇంకా ప్రయోగాత్మకమైన సినిమాలే చేస్తున్నాడు అంటే నిజంగా ఆయనకు సినిమాల మీద ఉన్న అభిరుచి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…