https://oktelugu.com/

Rajamouli- Adipurush: పురాణాలు అద్భుతంగా తియ్యాలంటే ఒక్క రాజమౌళి మాత్రమే సాధ్యం అని మరోసారి రుజువు అయ్యింది!

ఈ సినిమాలలో విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన కళ్లారా చూసాము. నిజంగా ఆ ప్రపంచం లోకి మనం అడుగుపెట్టామా అనేంతలా అనిపిస్తుంది రాజమౌళి సృజనాత్మకత చూస్తుంటే.

Written By: Vicky, Updated On : June 16, 2023 5:17 pm
Rajamouli- Adipurush

Rajamouli- Adipurush

Follow us on

Rajamouli- Adipurush: పురాణాలు మరియు ఇతిహాసాలు తెరకెక్కించడం అంటే సాధారణమైన విషయం కాదు, ఇప్పుడు మన దర్శకులు తీస్తున్న విధానం చూస్తే ఒకప్పటి డైరెక్టర్లు టెక్నాలజీ అసలు ఏమాత్రం లేని రోజుల్లోనే ఎంత అద్భుతంగా తీశారు, ఎంత పనితనం చూపించారు అనిపిస్తుంది. అలాంటి ప్రతిభ నేటి తరం దర్శకులలో ఇండియా మొత్తం వెతికినా కనిపించదు అని అనిపిస్తుంది. నేడు విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రాన్ని చూసినవాళ్లు, అలనాటి హీరో ఎన్టీఆర్ చేసిన రామాయణం సినిమాలు చూడండి.

గ్రాఫిక్స్ పరంగా కానీ, నటన పరంగా కానీ, సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజంగా రాముడు దిగి వచ్చి వెండితెర మీద కనిపించాడా?, అని అనిపించేలా ఉంటుంది పాత సినిమాలు చూస్తే. నేటి తరం లో అంత సహజత్వానికి దగ్గరగా ఉండే విధంగా తెరకెక్కించే దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది దర్శక ధీరుడు రాజమౌళి మాత్రమే అని చెప్పాలి. ఆయన తెరకెక్కించిన మగధీర , బాహుబలి సిరీస్ మరియు #RRR చిత్రాలకు రాజమౌళి విజన్ మరియు క్వాలిటీ కి మచ్చుతునక లాంటిది.

ఈ సినిమాలలో విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన కళ్లారా చూసాము. నిజంగా ఆ ప్రపంచం లోకి మనం అడుగుపెట్టామా అనేంతలా అనిపిస్తుంది రాజమౌళి సృజనాత్మకత చూస్తుంటే. అంతే కాదు పాత్ర తాలూకు రాజసం ని హీరో కి తగ్గట్టుగా చూపించి శబాష్ అనిపించడం లో రాజమౌళి దిట్ట. ఆయన తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లో ప్రభాస్ రాజు గా నటించాడు. వెండితెర మీద ఆయన కనిపించినంతసేపు రాజసం ఉట్టిపడుతుంది. కానీ ‘ఆదిపురుష్’ చిత్రం లో మాత్రం బాహుబలి లో ఉన్నంత రాజసం లో పావు శాతం కూడా కనిపించదు.

అందులో ఉన్నది ప్రభాసే, ఇందులో ఉన్నది కూడా ప్రభాసే.కానీ డైరెక్టర్ చూపించిన విధానం లో ఎంత తేడా ఉందో చూడండి. అందుకే పురాణాలు మరియు ఇతిహాసాలు తియ్యాలంటే రాజమౌళి మాత్రమే తియ్యాలి, ఇంకెవ్వరు తీసిన ‘ఆదిపురుష్’ లాగానే ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రాజమౌళి మహాభారతం తియ్యడం అనేది తన కల అని ఎన్నో సందర్భాలలో తెలిపాడు. ఈ దృశ్యకావ్యం కోసం మనం ఎన్ని రోజులు ఎదురు చూసినా తప్పు లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.