https://oktelugu.com/

Adipurush Openings: ట్రేడ్ కి ఊహించని షాక్ ఇచ్చిన ‘ఆదిపురుష్’ ఓపెనింగ్స్.. అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొకట్టి!

ప్రామిసింగ్ కంటెంట్ అని ప్రతీ ఒక్కరికీ అనిపించింది, అందుకే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు ముందు కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 16, 2023 / 05:09 PM IST
    Follow us on

    Adipurush Openings: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన సంగతి అందరికీ తెలిసిందే. టీజర్ విడుదల సమయం లో నెగటివ్ కామెంట్స్ ఊహకందని రేంజ్ లో వచ్చినా కూడా , ట్రైలర్ మరియు పాటలు విడుదల అయ్యినప్పుడు మాత్రం చిత్రం పై జనాల్లో ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది.

    ప్రామిసింగ్ కంటెంట్ అని ప్రతీ ఒక్కరికీ అనిపించింది, అందుకే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు ముందు కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇప్పటి వరకు మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అత్యధికంగా రాబట్టిన హీరో ప్రభాస్ మాత్రమే. గతం లో ఆయన హీరో గా నటించిన బాహుబలి 2 మరియు సాహూ మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    అయితే ఈ జరిగిన అడ్వాన్స్ బుకింగ్ మొత్తం సగానికి పైగా కార్పొరేట్ బుకింగ్ అని, నిజమైన బుకింగ్ కాదని కొంతమంది అంటున్నారు. వాళ్ళ అన్నమాటలలో కూడా నిజం ఉంది, చాలా ప్రాంతాలలో మొదటి రోజు టికెట్స్ అయ్యిపోయినట్టుగా ఆన్లైన్ లో చూపించిన, నేడు షో ప్రారంభం అయ్యే గంట ముందు కొన్ని టికెట్స్ ని ఆన్లైన్ లో పెట్టాడు. అంతే కాకుండా బయట టికెట్ కౌంటర్లు లో కూడా కరెంట్ బుకింగ్స్ లోనే టికెట్స్ దొరికాయి. ఇదే అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

    ఇక ఓపెనింగ్ ఓవరాల్ గా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, A సెంటర్స్ లో మంచి ఓపెనింగ్ దక్కిందని, కానీ క్రింద సెంటర్స్ లో మాత్రం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ, ఆశించిన రేంజ్ ఓపెనింగ్ అయితే రాలేదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.