Spirit Vs SSMB 29: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)…ఆయన చేసిన సినిమాలకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అతని అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) తో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా కోసం ఆయన తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ఎవరు చేయనటువంటి గొప్ప కథతో ఈ సినిమాను చేస్తున్నట్టుగా చెప్పాడు. అలాగే ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ ని స్టార్ హీరోగా మార్చడమే కాకుండా 2500 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేయబోతున్నారట. నవంబర్ నుంచి ప్రభాస్ ఈ సినిమాలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ డేట్స్ మొత్తాన్ని ఒక సంవత్సరన్నర పాటు సందీప్ వంగా బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా చేసినన్నీ రోజులు ఇంకే సినిమా చేయడు ఎందుకంటే ఈ సినిమాలో తన మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ సినిమాతో పాటు వేరే సినిమా చేస్తే తన స్టైల్ లో డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఆయన ఆ ఒక్క సినిమా కోసమే పూర్తి డేట్స్ ను కేటాయించమని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కండిషన్స్ ను ఒప్పుకున్న ప్రభాస్ సైతం ఓకే చెప్పారట.
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
ఇక ఇదిలా ఉంటే దర్శకధీరుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో తన సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే రాజమౌళి గతంలో మీకు పోటీ ఇచ్చే దర్శకులు ఎవరైనా ఉన్నారా అని అడగగా తను సందీప్ రెడ్డి వంగా పేరైతే చెప్పాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఇద్దరి దర్శకుల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండబోతోంది.
ఈ రెండు సినిమాలు కూడా ఒకే సమయంలో రిలీజ్ అవ్వబోతున్నాయి అనే వార్తలైతే వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ పలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తద్వారా తెలుగు సినిమా స్థాయిని పెంచుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…రాజమౌళి కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తు ఉంటాడు.
కాబట్టి ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అయితే దక్కుతోంది. ఇక సందీప్ రెడ్డి
వంగా తన సినిమాలను డిఫరెంట్ మేకింగ్ స్టైల్ లో తీస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సినిమాలకు సెపరేట్ గా అభిమానులైతే ఉన్నారు. మరి ఈ రెండు సినిమాలు పూర్తిగా దర్శకుల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ దర్శకుల కోసమే ఈ సినిమాలను చూసే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…