Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 Collection: కేవలం బాహుబలి 2 రికార్డు మాత్రమే మిగిలింది , అల్లు అర్జున్...

Pushpa 2 Collection: కేవలం బాహుబలి 2 రికార్డు మాత్రమే మిగిలింది , అల్లు అర్జున్ కే ఎలా సాధ్యమైంది?

Pushpa 2 Collection: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 నెలకొల్పిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. బాహుబలి 2 విడుదలై దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. ఈ చిత్రం పేరిట ఉన్న చాలా రికార్డ్స్ ఇంకా బ్రేక్ కాలేదు. ముఖ్యంగా అత్యధిక కలెక్షన్స్ రికార్డు అలానే ఉంది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ అందించే సాక్నిల్క్ నివేదిక ప్రకారం బాహుబలి 2 ఇండియా వైడ్ 1030 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ బాహుబలి 2 కలెక్షన్స్ రూ. 1788 కోట్ల గ్రాస్. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ చైనాలో భారీ ఆదరణ దక్కించుకోవడంతో వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది.

డొమెస్టిక్ గా దంగల్ కనీసం టాప్ టెన్ హైయెస్ట్ ఇండియన్ గ్రాసింగ్ చిత్రాల జాబితాలో కూడా లేదు. పుష్ప 2 మాత్రమే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. 11 రోజులకు పుష్ప 2 రూ. 1409 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇక ఇండియా పరిధిలో పుష్ప 2 వసూళ్లు రూ. 930 కోట్లు అని సమాచారం. మరో వంద కోట్లు రాబడితే పుష్ప 2.. బాహుబలి 2 డొమెస్టిక్ రికార్డు బ్రేక్ చేస్తుంది.

బాహుబలి 2 అనంతరం పుష్ప 2 సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. అయితే అల్లు అర్జున్ కి మాత్రమే ఈ ఫీట్ ఎలా సాధ్యమైంది?. అల్లు అర్జున్ కంటే ముందే భారీ స్టార్డం సాధించిన వివిధ పరిశ్రమలకు చెందిన నటులు బాహుబలి 2 రికార్డ్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. అల్లు అర్జున్ సక్సెస్ వెనుక చాలా కృషి ఉంది. కేవలం పుష్ప మూవీతో వచ్చి పడిన ఫేమ్ కాదు.

నార్త్ ఆడియన్స్ యూట్యూబ్ లో ఉచితంగా సౌత్ ఇండియా డబ్బింగ్ సినిమాలు చూస్తారు. తెలుగు హీరోలైన రామ్ పోతినేని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టాయి. అల్లు అర్జున్ సినిమాలను కూడా నార్త్ ఆడియన్స్ బాగా చూస్తారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి సౌత్ హీరోల చిత్రాలు ఫుల్ కిక్ ఇస్తాయి. అల్లు అర్జున్ నటించిన సరైనోడు మూవీ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. 200 మిలియన్ వ్యూస్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ సరైనోడు.

అలాగే అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సైతం భారీ ఆదరణ దక్కించుకుంది. 175 మిలియన్ వ్యూస్ కి పైగా ఆ సినిమా రాబట్టింది. ఆ విధంగా నార్త్ లో అల్లు అర్జున్ రిజిస్టర్ అయ్యారు. పుష్ప సక్సెస్ తో ఆయన నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన ఫేమ్ రాబట్టారు. పుష్ప 2 తో అది పీక్స్ కి చేరింది. తెలుగుకు మించిన ఆదరణ పుష్ప 2 చిత్రానికి హిందీలో దక్కింది. ఈ కారణాలతో అల్లు అర్జున్ బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసే స్థాయికి చేరాడు.

Exit mobile version