Mega family : ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హవా నడుస్తుందను చెప్పాలి. ఇటు సినిమా ఇండస్ట్రీలో అయినా అటు పొలిటికల్ గా ఆయన రెండు విధాలుగా వాళ్ళు చక్రం తిప్పుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఒకప్పుడు మెగాస్టార్ మెగా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులను హీరోలుగా తయారు చేస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం మెగా హీరోలను పొలిటిషియన్స్ గా మార్చే పనిని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన టాప్ హీరోగా వెలుగొందడమే కాకుండా ‘ప్రజారాజ్యం ‘ పార్టీని పెట్టి పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. నిజానికి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ సంవత్సరం ముఖ్యమంత్రి అవుతారని చాలామంది కనులుగన్నారు. నిజానికి ఆయన జెన్యూన్ గా పోరాటం చేసి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యేవాడని ఇప్పటికి చాలా మంది చెబుతుంటారు. కానీ ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ని మోసం చేశారని పొలిటికల్ గా అనుభవం లేకపోవడం తో ఎవరు ఏం చెప్పినా చిరణాబి నమ్మారు. కానీ ఇక్కడ ఇతర పార్టీల కోవర్ట్ లు ఉంటారని గమనించలేకపోయారు… అందువల్లే ఆయన రాజకీయాల్లో ఎదగలేకపోయాడని చెబుతూ ఉంటారు. ఇక మొదటి నుంచి మృదు స్వభావి అయిన చిరంజీవి ఇతర పార్టీ ల నుంచి ఎదురయ్యే విమర్శలను తట్టుకోలేకపోయాడు. దానివల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పోటీలోకి దిగిన చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఇక ముఖ్యమంత్రి హోదాలో కనిపిస్తాడు అనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది.
కేవలం 18 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే గెలిచి చిరంజీవి స్టామినా ఇంతేనా అని జనాలు అనుకునేలా చేశారు. నిజానికి రాజకీయంగా కొత్తగా పార్టీ పెట్టిన చిరంజీవికి 18 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆ సీట్ల సంఖ్య 30 నుంచి 40 లోపు ఉండేది. కానీ కొంతమంది కావాలనే ఆయన పక్కనే ఉండి ఆయన్ని చాలా వరకు మోసం చేశారు. దానివల్ల 18 సీట్లకే పరిమితమయ్యాడు…
అయినప్పటికి మొదటి సారి పోటీకి వచ్చిన పార్టీకి అన్ని సీట్లు రావడం కూడా కష్టమే అయినా కూడా చిరంజీవి తెచ్చుకున్నాడు అంటే కేవలం అతని స్టార్ డమ్ మాత్రమే అంటూ ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఇక చిరంజీవికి ఎక్కువ సీట్లు రాకపోవడానికి మరొక కారణం ఏంటి అంటే అప్పటికే కాంగ్రెస్, టిడిపి పార్టీ జనాల్లో బలంగా పాతుకుపోయాయి. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి లీడ్ చేస్తుండడం మనం చూశాం. ఇక ఇద్దరు ఉద్దండులు మధ్య ఏమాత్రం పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని చిరంజీవి వచ్చి 18 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు.
ఇక ఇదిలా ఉంటే అప్పుడు నాగబాబు నరసాపురం ఎంపీ కాండేట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ యువరాజ్యం అంటూ యూత్ మొత్తాన్ని మమేకం చేసే ప్రయత్నం చేశాడు తప్ప రాజకీయంగా అరంగేట్రం అయితే చేయలేదు… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ మంత్రి గా, డిప్యూటీ సిఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీని సక్రమంగా ముందుకు నడిపించలేక చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేశాడు… దాంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అతనికి కేంద్ర మంత్రి పదవి బాధ్యతను సోనియా గాంధీ అప్పచెప్పారు.
ఇక ఆ టర్మ్ ముగిసిన తర్వాత చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పుడూ నాగబాబు మంత్రి అవ్వడం పట్ల మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ మొదట మంత్రి గా పదవి బాధ్యతను పొందడం, ఆ తర్వాత తమ్ముళ్లు పదవులు పొందడం అనేది వరుసగా మనం చూస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా మెగాస్టార్ మొదటి వరుసలో ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…