Akhanda 2 Release: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) విడుదల తేదీ పై ఎట్టకేలకు అభిమానులకు మేకర్స్ త్వరలోనే శుభవార్త వినిపించబోతున్నారా..?, ఈ చిత్రానికి ఉన్న సమస్యలన్నీ వీడినట్టేనా అంటే అవుననే చెప్పాలి. గత రెండు మూడు రోజులుగా ‘అఖండ 2’ నిర్మాతలు EROS ఇంటర్నేషనల్ సంస్థ తో చర్చలు జరుపుతూ ఉన్నారు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగిపోయాయో, లేకపోతే వేరే ఏదైనా ఒప్పందం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆ అగ్రిమెంట్ ని మద్రాసు హై కోర్టు లో సబ్మిట్ చేయగా, ఈ చిత్తాన్ని విడుదల చేసుకోవడానికి అనుమతిని మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇది నందమూరి అభిమానులకు శుభవార్త నే. కానీ ఇక్కడితో అంతా అయిపోలేదు. తేల్చాల్సిన లెక్కలు ఇంకా చాలానే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అదేమిటంటే నిర్మాతకు లోకల్ గా ఫైనాన్షియర్స్ నుండి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అదే విధంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన బయ్యర్లు ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి కేవలం అడ్వాన్స్ మాత్రమే కట్టారు. మిగిలిన పెండింగ్ డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంది. నిర్మాత బయ్యర్స్ అందరితో మాట్లాడి, ప్రకటించిన విడుదల తేదీ లోపు పెండింగ్ డబ్బులు కడుతారో లేదో తెలుసుకొని, వాళ్ళు సూచించిన డేట్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఈ నెల 12న ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం నిర్మాత ఆలోచన మాత్రమే. బయ్యర్స్ ఈ డేట్ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే నేడు సాయంత్రం లోపు విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. చూడాలి మరి ఏమి జరగబోతుందో. విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఈ సినిమా నుండి సరికొత్త టీజర్ వస్తుందా లేదా అనే సందేహం లో ఉన్నారు ఫ్యాన్స్,
కానీ అలాంటివేమీ మేకర్స్ ప్లాన్ చేయలేదట. కేవలం విడుదలకు ఒక రోజు ముందు ప్రెస్ మీట్ ని మాత్రమే ఏర్పాటు చేస్తారట. ప్రీమియర్ షోస్ కూడా ఉంటాయని తెలుస్తోంది. కానీ ఇప్పుడు రెండు ప్రభుత్వాలకు మరోసారి ప్రత్యేకంగా టికెట్ రేట్స్ జీవో కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ నుండి జీవో తొందరగానే వచ్చేస్తుంది , కానీ తెలంగాణ లో జీవో అంత తేలికగా రావడం కష్టం. కాబట్టి అంత సమయం లేదు కనుక, టికెట్ హైక్స్ లేకుండానే తెలంగాణ లో రిలీజ్ అవుతుందా?, లేదంటే తెలంగాణ లో టికెట్ హైక్స్ కోసం మరో వారం రోజుల పాటు సినిమాని వెనక్కి నెడుతారా? అనేది చూడాలి. ఏది ఏమైనా, నేటి సాయంత్రం లోపు ‘అఖండ 2’ విడుదల తేదీ పై కచ్చితమైన సమాచారం మూవీ టీం నుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Breaking News:
Madras High court clears #Akhanda2 after Eros & 14 Reels submit settlement agreement with an internal understanding!
Now it all depends on Local Financial Clearance and all the Distributors clearing the pending payments and whether this will be enough!
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 9, 2025