https://oktelugu.com/

Bobby Deol : ఒక్క ఫొటో జీవితాన్నే మార్చేసింది.. బాబీ డియోల్ కష్టాలు తీర్చి స్టార్ ను చేేసింది…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఇంకా అందులో కొంతమంది సక్సెస్ ఫుల్ గా ముందుకు రాణిస్తుంటే మరి కొంత మంది మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 25, 2025 / 09:02 AM IST
    Sandeep Reddy Vanga , Ranbeer Kapoor , Bobby Deol

    Sandeep Reddy Vanga , Ranbeer Kapoor , Bobby Deol

    Follow us on

    Bobby Deol : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఇంకా అందులో కొంతమంది సక్సెస్ ఫుల్ గా ముందుకు రాణిస్తుంటే మరి కొంత మంది మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పటికే బాలీవుడ్ హీరోలు సైతం మంచి సినిమాలను చేయడానికి చాలా వరకు ఆసక్తి ని చూపిస్తున్నారు…

    సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి తనదైన రీతిలో సత్తా చాటుకుని ఆయన కంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు మాత్రం సందీప్ రెడ్డి వంగ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కబీర్ సింగ్ (Kabeer Sing) సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత రన్బీర్ కపూర్ (Ranbeer Kapoor) తో ఆనిమల్ సినిమా చేస్తున్న సమయంలో అతనికి ఆ సినిమాలో అబ్రరర్ (Abrar) అనే ఒక నెగెటివ్ పాత్ర కోసం ఎవరిని తీసుకుందామని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు సీసీఎల్ మ్యాచులు జరుగుతున్న సమయంలో ఆ మ్యాచ్ లను చూస్తున్న బాబి డియోల్ పిక్ ఒకటి అతనికి కనిపించిందట. ఆ పిక్ లో ఆయన చాలా స్టైలిష్ గా ఉండడంతో ఆ పిక్ స్క్రీన్ షాట్ తీసి సందీప్ రెడ్డి వంగ తను భద్రంగా దాచుకున్నాడట. ఇక ఆ తర్వాత ఒకరోజు బాబీ డియోల్ నెంబర్ తెలుసుకొని అతనికి నేను సందీప్ రెడ్డి వంగ ను నా నెక్స్ట్ సినిమా కోసం మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని మెసేజ్ చేశారట.

    ముందు బాబీ డియోల్ ఎవరో ఆకతాయిలు ఇలా చేశారు అని అనుకున్నప్పటికీ తర్వాత సందీప్ రెడ్డి వంగ నుంచే మెసేజ్ వచ్చిందని తెలుసుకొని నాకు మీ సినిమాలు అంటే చాలా ఇష్టం అని మెసేజ్ పెట్టాడట.

    మొత్తానికైతే వీళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత సిసిఎల్ లో మీరు నిల్చున్న పిక్ ను ఫోటో తీసి పెట్టుకున్న అని సందీప్ రెడ్డి వంగ ఆ ఫోటో అతనికి చూపించారట. ఇక ఆ లుక్ తోనే నాకు అబ్రార్ అనే క్యారెక్టర్ కావాలి అని చెప్పడంతో తప్పకుండా చేస్తానని చెప్పారట.

    మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ అలా సెట్ అయిందన్న మాట…ఇక ఈ సినిమా రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించడం తో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే వచ్చింది….