Vishal : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్… ఆయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి సక్సెస్ లను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పందెంకోడి సినిమాతో తెలుగులో స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసిన ఆయన ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కొంతవరకు ఆయన క్రేజ్ తగ్గిందనే చెప్పాలి.
తమిళ్ ఇండస్ట్రీ నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో విశాల్ ఒకరు. కెరియర్ మొదట్లో మంచి సినిమాలు చేసి సూపర్ సకేస్ లను అందుకున్న విశాల్ ఈ ఈ మధ్య చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ‘మదగదరాజ’ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో అక్కడ అతన్ని చూసిన ప్రేక్షకులందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆయన చాలా వీక్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాడు. అలాగే మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఆయన చేతులు కూడా వణుకుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితిల్లో విశాల్ ను చూసిన చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు విశాల్ చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి అలాంటి ఒక హీరో ఇప్పుడు ఇలా అయిపోవడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన అలా ఎందుకు అయ్యాడనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఆయన బాలా డైరెక్షన్ లో ‘వాడు వీడు’ అనే సినిమా చేస్తున్న సమయంలో చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. అప్పటికప్పుడు అతన్ని ఆస్పత్రిలోకి తీసుకెళ్లినప్పటికి చెన్నైలో ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయన కొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే అందరూ అది నార్మల్ గా తగిలిన గాయాలే అనుకున్నారు.
కానీ ఆ తర్వాత అతనికి విపరీతమైన తలనొప్పి రావడం, కాళ్ళు చేతులు వనికిపోవడం చూసి వాళ్ల పేరెంట్స్ హాస్పిటల్ కి తీసుకెళ్తే బ్రెయిన్ లోని కొన్ని నరాలు చితికిపోయినట్టుగా వాళ్లు చెప్పారు. మరి దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకోవడానికి ఆయన తరచుగా ఫారన్ అయితే వెళుతూ వస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే తను అలాంటి ఒక పెయిన్ ని తట్టుకొని కూడా కొన్ని సినిమాలైతే చేశారు… ఇక బ్రెయిన్ లో కొన్ని నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల విపరీతమైన తలనొప్పి రావడమే కాకుండా ఆకలి ఉండదు. నిలబడడానికి కూడా స్థోమత ఉండదు. అలాగే చేతులు కాళ్లు వణుకుతూ ఉంటాయి అంటూ కొంతమంది వైద్యులు చెబుతున్నారు. విశాల్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మరి తొందర్లోనే ఆయన ఫారన్ లో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ విషయం తెలుసుకున్న విషయాలు విశాల్ అభిమానులు మాత్రం బాలా మీద చాలావరకు సీరియస్ అవుతున్నారు. ఆయన సినిమాల్లో రియలేస్టిక్ గా ఉండాలనే ఉద్దేశ్యం తో ప్రతిదీ రియల్ గా చేయించాలని అనుకుంటాడు. అందువల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని చాలా మంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…