Star Directors
Star Directors: ఇండస్ట్రీలో ఉన్న నటులకు కానీ, దర్శకులకు కానీ రోజుకొక కొత్త సవాల్ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఒకసారి హిట్ కొట్టి రిలాక్స్ అవుదాం అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచం లో మనం ఒక సినిమా తీసి రిలాక్స్ అయ్యామంటే మనల్ని మించిన వాళ్లు చాలామంది మనల్ని డామినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు.
కాబట్టి సినిమా దర్శకుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను రంజింప చేయాలి. అలాగే తనని తాను అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇలా ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేట్ అవ్వలేక వరుసగా ప్లాప్ లను అందుకొని ఫేడ్ అవుట్ కి దగ్గరగా ఉన్న దర్శకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
వివి వినాయక్
ఒకప్పుడు ఈయన సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా స్టార్ హీరోలందరికీ మంచి విజయాలను అందించిన వినాయక్ ప్రస్తుతం మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడు ఆయనకు డేట్స్ ఇచ్చే హీరోలు కూడా కరువయ్యారు అంటే ప్రస్తుతం ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం ఆయన మారుతున్న జనరేషన్ కి అనుగుణంగా కొత్త స్క్రిప్ట్ ను ఎంచుకొని హీరోలను కొత్తగా చూపించకపోడమనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈయన మళ్లీ ఒక మంచి కొత్త స్టోరీ తో వస్తే సక్సెస్ సాధించిన అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి…
శ్రీను వైట్ల
ఒకప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాల్లోనే కామెడీ ని కలగలిపి సూపర్ హిట్ సినిమాలను తీయొచ్చు అని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు శ్రీనువైట్ల… ఈయన కెరియర్ లో ఇప్పటి వరకు సూపర్ సక్సెస్ లను అందుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయిన సూపర్ సక్సెస్ అందుకొని కం బ్యాక్ అవుతాడా లేదా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…