Homeఎంటర్టైన్మెంట్Naresh-Pavitra Lokesh: మరోసారి అడ్డంగా బుక్కైన నరేష్-పవిత్రా లోకేష్

Naresh-Pavitra Lokesh: మరోసారి అడ్డంగా బుక్కైన నరేష్-పవిత్రా లోకేష్

Naresh-Pavitra Lokesh: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ నాలుగో, పవిత్ర మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు కలిసి తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసే ప్రయాణం చేస్తున్నారు. దీంతో నరేష్, పవిత్ర విషయం అందరి నోళ్లలో నానుతోంది. ఈ వయసులో కూడా వారిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తోంది. కానీ నరేష్ మూడో భార్య రమ్య మాత్రం విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తోంది.

Naresh-Pavitra Lokesh
Naresh-Pavitra Lokesh

మరోవైపు పవిత్ర మొదట ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను చేసుకుని అతడితో విడాకులు తీసుకుని కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో సహజీవనం చేస్తోంది. కానీ అతడిని పెళ్లి చేసుకోలేదు. 2018 నుంచి విడిగా ఉంటోంది. దీనిపై సుచేంద్ర ప్రసాద్ పవిత్రను నరేష్ మార్చేశాడని ఆరోపణలు చేస్తున్నాడు. ఆధార్, పాస్ పోర్టులలో తన భార్య పేరు పవిత్రగానే ఉందని చెబుతున్నాడు. దీంతో నరేష్, పవిత్రల తీరు వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో వీరి జంటను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: KGF 3 Release Date: షాకింగ్ : ‘కేజీఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యాక్షన్ లవర్స్ కి కిక్కే కిక్కు

పవిత్రకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించింది కూడా నరేష్ కావడం గమనార్హం. దీంతో వీరి బంధం ఇంకా ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదని చెబుతున్నారు. మైసూర్ లో ఓ హోటల్ ఉండగా నరేష్ మూడో భార్య రమ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీసినా తాము పెళ్లి చేసుకుంటామని చెప్పడం విశేషం. ఎక్కడకు వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్తూ పలు విందులు, వినోదాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇక వారి జతను విడదీసే వారు ఎవరు లేరనే చర్చ కూడా వస్తోంది. ఈ క్రమంలో నరేష్, పవిత్రల కలయిక పరిశ్రమలో ఓ కొత్త సంచలనంగా మారింది.

Naresh-Pavitra Lokesh
Naresh-Pavitra Lokesh

ఇక నరేష్ మూడో భార్య గురించి ఓ కొత్త వాదన తెస్తున్నాడు. రమ్యకు కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఆమెతో విడిగా ఉంటున్నట్లు ప్రకటిస్తున్నాడు. దీంతో వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. నరేష్, పవిత్ర ల పెళ్లి ఖాయమనే తెలుస్తోంది. వారి జంటను ఆశీర్వదించడమే ఇప్పుడు అందరి కర్తవ్యంగా భావిస్తున్నారు. మొత్తానికి పవిత్ర, నరేష్ ల పెళ్లి త్వరలో జరగనుందని టాక్ మాత్రం వినిపిస్తోంది. కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే వారు దండలు మార్చుకుంటారని చెబుతున్నారు.

2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం చిత్రంలో పవిత్ర, నరేష్ కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం చిగురించినట్లు తెలుస్తోంది. ఇక తరువాత కాలంలో వారి ప్రేమ ఇంతింతై వటుడింతై అన్న చందంగా మారి ఇప్పుడు సినిమా పరిశ్రమలో పెద్ద సంచలనంగా తయారయింది. సో వీరిద్దరు పెళ్లిపీటలు ఎప్పుడు ఎక్కుతారోననే అందరు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. తాజాగా వీరిద్దరు మైసూర్ లోని హోటల్ లో ఒకే గదిలో ఉండి వేరువేరుగా వీడియోలు విడుదల చేశారు. దీంతో నెటిజన్లు కూడా వీరితో ఓ ఆట ఆడుకున్నారు. ఒకే గదిలో ఉంటూ వేరువేరుగా వీడియోలు పెట్టినంత మాత్రాన వీరు వేరుగా ఉన్నట్లు భావించడం వారి భ్రమే. అభిమానులకు అనుమానం వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం తెలిసిందే.

Also Read:Minister Roja: ఓకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్.. రోజా హాట్ కామెంట్స్
Recommended Videos
అడ్డంగా బుక్కైన నరేష్-పవిత్రా లోకేష్ || Naresh Pavitra Lokesh Latest News
కుమార్తెతో బిడ్డను కన్న 76 ఏళ్ల ఎలాన్ మస్క్ తండ్రి || Elon Musk Father Errol Musk || Viral News
చిరంజీవి సినిమాకి రవితేజ రెమ్యూనరేషన్ || Raviteja Remunaration For Chiranjeevi 154 Movie || #Mega154

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version