https://oktelugu.com/

Photo Story: ఒకప్పుడు స్టార్ హీరోయిన్..ఇప్పుడు పవర్ ఫుల్ IPS ఆఫీసర్..ఈమె ఎవరో గుర్తుపట్టగలరా..? ఆమె హిస్టరీ చూస్తే నోరెళ్లబెడుతారు!

బాలీవుడ్ ఒక హీరోయిన్ సినిమాల్లోకి వచ్చి, ఆ తర్వాత ఆ రంగాన్ని వదిలేసి ఐపీఎస్ కోచింగ్ తీసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ లో పవర్ ఫుల్ ఆఫీసర్ గా కొనసాగుతుంది. ఆమె ఎవరో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 04:41 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సినిమాల్లోకి వచ్చే ముందు మన హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇతర రంగాల్లో పని చేసి రావడం మనం వంటివి మనం చాలా చూసాము. డాక్టర్, లెక్చరర్, ఐటీ వంటి జాబ్స్ ని వదిలి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రహ్మానందం, MS నారాయణ, నవీన్ పోలిశెట్టి , వెన్నెల కిషోర్ ఇలా ఎంతో మంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. ఇలా ఇతర రంగాల నుండి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళని ఇన్ని రోజులు మనం చూసాము కానీ, సినీ రంగం నుండి ఇతర రంగం లోకి వెళ్లి గొప్పగా రాణించిన వాళ్ళను ఇది వరకు మనం చూడలేదు. కానీ బాలీవుడ్ ఒక హీరోయిన్ సినిమాల్లోకి వచ్చి, ఆ తర్వాత ఆ రంగాన్ని వదిలేసి ఐపీఎస్ కోచింగ్ తీసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ లో పవర్ ఫుల్ ఆఫీసర్ గా కొనసాగుతుంది. ఆమె ఎవరో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Photo Story(1)

    ఆ హీరోయిన్ పేరు సిమాల ప్రసాద్..ఈమె తెలుగు లో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా చేయలేదు కాబట్టి, మన ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఈమె ఆదర్శవంతమైన స్టోరీ ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. భోపాల్ ప్రాంతం కి చెందిన ఈ అమ్మాయి బాలీవుడ్ లో 2016 వ సంవత్సరం లో అలీఫ్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా పర్వాలేదు, యావరేజ్ అనే రేంజ్ లో ఆడింది. ఈ చిత్రం తర్వాత ఆమె 2019 వ సంవత్సరం లో ‘నకాష్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సిమాల కి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. చిన్నప్పటి నుండి ఈమెకి సినిమాల పైన మాత్రమే కాకుండా రాజకీయాలు, సామజిక శాస్త్రం పై కూడా అమితాసక్తి ఉండేది.

    భవిష్యత్తులో ఏమి అవ్వాలి అని ఆలోచిస్తూ, ఐపీఎస్ అధికారి అవ్వాలని చాలా బలంగా కోరుకుంది. దానికి తగ్గట్టుగానే పోటీ పరీక్షలు రాయడానికి రేయింబవళ్లు ఎంతో కష్టపడింది. తోలి ప్రయత్నంలోనే పీఎస్సీలో పాస్ అయ్యి, DSP గా పోస్టింగ్ తీసుకుంది. అక్కడితోనే ఈమె ఆగిపోలేదు, తన ఐపీఎస్ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంకా గట్టి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే UPSC లో ఉతీర్ణత పొందింది. కోచింగ్ తీసుకుంటూ సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకే ఇంకా ఉద్యోగాలు రావడం లేదు. బయట మనం ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాము. అలాంటిది సిమాల ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా IPS ఆఫీసర్ అయ్యిందంటే, ఆమె కృషి, పట్టుదల, తెలివితేటలూ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. సాధించాలి అనే పట్టుదల మనసులో బలంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి సిమాల ప్రసాద్ ఒక ఉదాహరణ.