Jhansi Railway Station: ఆర్మీ వైద్యుడు ఝన్సీ స్టేషన్ లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. పన్వేల్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ లో ఓ గర్భిణీ భర్త, బిడ్డతో ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. భర్త వెంటనే రైల్ మదద్ యాప్ తో ఫిర్యాదు చేశాడు. ఝాన్సీ స్టేషన్ లో ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూతి వార్డుగా మార్చారు. అందుబాబులో ఉన్న సాధారణ వనరులతో ప్రసవం చేసిన మేజర్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.