Devara Collections : ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదలై నేటితో 25 రోజులైంది. కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ మాత్రం ఇంకా ఆగలేదు. ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేస్తుంది. వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా, వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. నిన్న, మొన్న ఈ సినిమాకి వచ్చిన షేర్ వసూళ్లను చూస్తే ఈ విషయం అందరికీ అర్థం అవ్వుద్ది. నిన్న అనగా 24వ రోజు ఈ చిత్రానికి దాదాపుగా కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి కూడా 24 వ రోజు ఈ స్థాయి వసూళ్లు రాలేదని ట్రేడ్ పండిట్లు చెప్తున్నారు. #RRR చిత్రానికి నాన్ స్టాప్ గా ఆగకుండా 17 రోజులు కోటి రూపాయలకు పైగా డైలీ షేర్స్ వచ్చేవి.
కానీ ‘దేవర’ చిత్రానికి ఏకంగా 19 రోజుల పాటు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యినట్టే, ఒక్క బాహుబలి సిరీస్, హనుమాన్ మినహా. ఇప్పుడు 20 రోజులు దాటిన తర్వాత కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది అంటే, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా 24 రోజులకు కలిపి ఈ సినిమాకి 185 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ నుండి, 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు మిగిలిన భాషలతో కలిపి వచ్చాయని అంటున్నారు నిర్మాతలు. ఇక గ్రాస్ పరంగా చూస్తే 400 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. రాజమౌళి, ప్రభాస్ తర్వాత మన టాలీవుడ్ నుండి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరో గా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.
ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టే సినిమాగా దేవర నిల్చిందంటే అది కేవలం ఎన్టీఆర్ స్టామినానే అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే తెలుగు లో ఇంత పెద్ద సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా, మిగిలిన భాషల్లో అంత పెద్దగా ఆడలేదనే చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు బయ్యర్స్ కి ఈ చిత్రం భారీ నష్టాలను మిగిలించింది. అలాగే కేరళ కూడా ఫ్లాప్ అనే చెప్పొచ్చు. కానీ బాలీవుడ్ లో మాత్రం డీసెంట్ గా 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి యావరేజ్ గా నిల్చింది. మరి ఇతర భాషల్లో మిశ్రమ స్పందన వచ్చింది కాబట్టి, దేవర 2 ని తీస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ‘దేవర’ చిత్రం కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్ల మాత్రమే ఆడింది, సినిమాకి సీక్వెల్ తీసేంత కంటెంట్ ఆ చిత్రంలో లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.